amp pages | Sakshi

అమెరికా రాయితీ ఇవ్వకపోతే కొనుగోలు కష్టమేః పాకిస్తాన్

Published on Tue, 05/03/2016 - 20:35

వాషింగ్టన్ః ఎఫ్-16 యుద్ధవిమానాలు కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ మొత్తం డబ్బు చెల్లించాల్సిందేనని, ఎటువంటి రాయితీలు ఇవ్వబోమని అమెరికా స్పష్టం చేసింది. అవసరమైతే పాకిస్తాన్ తన జాతీయ నిధులనుంచి విమానాలు కొనుగోలు చేయొచ్చని సలహా కూడ ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ కూడ తన నిర్ణయం మార్చుకునేట్లు కనిపిస్తోంది.


ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అమెరికా రాయితీలు ఇవ్వని పక్షంలో అంత పెద్దమొత్తంలో డబ్బు చెల్లించి విమానాలను కొనుగోలు చేయడం కష్టమేనని పాకిస్తాన్ విదేశీ వ్యవహారల సలహాదారు సర్తాజ్ అజీజ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.  అయితే తీవ్రవాద వ్యతిరేక ప్రచారంలో తాము వాడే ఎఫ్-17 థండర్ జెట్స్ స్థానంలో ప్రభావవంతమైన ఎఫ్-16 కు ప్రాధాన్యతనిచ్చామని అజీజ్ తెలిపినట్లు ఓ పాకిస్తానీ వార్తా పత్రిక తెలిపింది. చైనా ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ భాగస్వామ్యంతో పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ ద్వారా అభివృద్ధి చేసిన జెఎఫ్-17 పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు ఇకపై వెన్నెముకగా మారుతుందని కూడ ఆయన అభిప్రాయపడ్డట్టు వెల్లడించింది.


అమెరికానుంచి ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను కొనేందుకు ఇంతకు ముందు పాకిస్తాన్  ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అనుకున్న ప్రకారం అమెరికా రాయితీని కల్పించి ఉంటే... ఎనిమిది విమానాలకు  పాకిస్తాన్ తన జాతీయ నిధులనుంచి అమెరికాకు 270 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. అయితే కొనుగోలుకు కాంగ్రెస్ ఆమోదించినప్పటికీ, విదేశీ మిలటరీ ఫైనాన్సింగ్ నిధులను వినియోగించడంపై  అమెరికా సెనేటర్లు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పరిస్థితి తారుమారైంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)