amp pages | Sakshi

భారత్-పాక్ అణుయుద్ధంపై బ్రిటన్ భయం

Published on Thu, 07/07/2016 - 03:53

- 2001 నాటి ఘటన తాజాగా వెల్లడి
తప్పుడు నిఘా సమాచారంతోనే ఇరాక్‌పై యుద్ధం
 
 లండన్ : 2001లో భారత పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగినప్పుడు భారత్-పాకిస్తాన్‌ల మధ్య అణు యుద్ధం జరుగుతుందేమోనని బ్రిటన్ భయపడినట్లు తాజా నివేదిక ద్వారా తెలిసింది. అప్పుడ ఇరుదేశాలను బుజ్జగించి సైనిక చర్యను ఆపడానికి బ్రిటన్ యత్నించింది. 2003లో ఇరాక్ దాడిపై నియమించిన విచారణ కమిటీ నివేదిక బుధవారం బహిర్గతమైంది. మాజీ ఉన్నతాధికారి జాన్ చిల్కాట్ నేతృత్వంలోని ఈ కమిటీ నివేదిక 12 సంపుటాలతో వెలువడింది.

అప్పటి బ్రిటన్ విదేశాంగ మంత్రి జాక్ స్ట్రా ఈ కమిటీ ముందు హాజరై భారత్-పాక్ అణు యుద్ధం గురించి చెప్పారు. దీని గురించి నాటి అమెరికా విదేశాంగ మంత్రి పావెల్‌తో సమాచారం పంచుకున్నట్లు తెలిపారు. అమెరికాలో 9/11 ఉగ్రదాడి తర్వాత బ్రిటన్ దృష్టి అఫ్గానిస్తాన్‌పై ఉండిందని, అయితే దాని తర్వాత 2001 డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై ఉగ్రవాదాడి తర్వాత బ్రిటన్, అమెరికాలు భారత్-పాక్‌లపై దృష్టి పెట్టాయన్నారు. నాటి బ్రిటన్ ప్రధాని బ్లెయిర్ తప్పుడు నిఘా సమాచారంతోనే ఇరాక్ నియంత సద్దాంను తప్పించేందుకు అక్రమ యుద్ధానికి దిగినట్లు స్ట్రా చెప్పారు. నిరాయుధీకరణ అవకాశమున్నా బ్రిటన్ ఎలాంటి శాంతి చర్యలకు పూనుకోలేదని చెప్పారు. ఇరాక్‌పై అమెరికాతో కలసి యుద్ధం చేసిన ఆ సమయంలో సైనిక చర్య చివరి ప్రయ్నతం కాదన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)