వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జనరల్ మోటార్స్ వాహనాల భారీ రీకాల్
Published on Sat, 08/05/2017 - 11:18
వాషింగ్టన్: అమెరికాకు చెందిన అతిపెద్ద ఆటో మేకర్ జనరల్ మోటార్స్ సంస్థ భారీ ఎత్తున వాహనాలను రీకాల్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8లక్షల పికప్ ట్రక్కులను వెనక్కి తీసుకుంటోంది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ యంత్రంగా శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది. షెవర్లే సిల్వరాడో 1500, జీఎంసీ సియర్రా1500 పికప్ టక్కులను రీకాల్ చేస్తోంది.
2014 నాటి మోడల్ ట్రక్కులు షెవర్లే సిల్వరాడో 1500, జీఎంసీ సియర్రా1500 లలో తాత్కాలికంగా విద్యుత్ శక్తి స్టీరింగ్‌లో లోపాలు, ముఖ్యంగా తక్కువ వేగంతో ప్రయాణించే సమయంలో తాత్కాలిక సమస్యలు ఎదురవుతున్నాయని జనరల్ మోటార్స్ ప్రకటిచింది. అందుకే వీటిని రీకాల్ చేస్తున్నట్టు చెప్పింది.
అమెరికాలో 6 లక్షల 90వేలు వాహనాలను, కెనడాలో 80వేలు వాహనాలతోపాటు ఇతర మార్కెట్లలో 25వేల వాహనాలను రీకాల్ చేస్తోంది. జీఎం డీలర్లు కొత్త సాఫ్ట్‌వేర్‌తో ఈ లోపాన్ని పరిష్కరించనున్నారని ప్రకటించింది. అయితే ప్రమాదాలు, గాయాలకు సంబంధింత తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని జీఎం ప్రతినిధి టామ్ వికిన్సన్ పేర్కొన్నారు. అయితే 2015 సం.రం మోడల్ వాహనాల్లో దీనికి సంబంధించి కొన్ని మార్పులను జోడించింది.
#
Tags