amp pages | Sakshi

అరల్లో ఎకరాలు ఎకరాలు!

Published on Wed, 10/11/2017 - 03:29

ప్రపంచంలో అన్నీ మారిపోతున్నాయి. వెళ్లే కార్లు మొన్నటి మాదిరిగా లేవు. నడిచే రోడ్లు, ఉండే ఇళ్లు కూడా గతంలోలా లేవు. తాజాగా ఈ జాబితాలోకి వ్యవసాయం కూడా చేరిపోతోంది!  నిన్న మొన్నటి దాకా గ్రీన్‌హౌస్‌ వ్యవసాయంపై బోలెడన్ని వార్తలు వచ్చేవి. ఇప్పుడు ఆ ట్రెండ్‌ మారిపోయింది. వర్టికల్‌ ఫార్మింగ్‌దే హవా. ఫొటోలో కనిపిస్తున్న సోలార్‌ ప్యానెళ్లను చూశారుగా.. ఇవి కూడా ఓ వర్టికల్‌ ఫార్మ్‌వే. అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని బ్రదర్లీ లవ్‌ భవనంలో ఏర్పాటైంది ఈ నిట్టనిలువు వ్యవసాయ క్షేత్రం. మెట్రోపోలిస్‌ ఫార్మ్‌ పేరుతో ఏర్పాటైన ఈ క్షేత్రం విస్తీర్ణం 2.2 ఎకరాలు మాత్రమే కానీ... 660 ఎకరాల సాధారణ నేలలో పండించేంత మోతాదులో పంటలు పండుతాయి ఇక్కడ.

అబ్బో అదెలా సాధ్యమంటే... అంతా టెక్నాలజీ మహిమ అంటున్నారు మెట్రోపోలిస్‌ ఫార్మ్‌ యజమానులు. ఒకదానిపై ఒకటి ఉంచే అరల్లో పంటలు పండుతాయి. సూర్యరశ్మి స్థానంలో ఎల్‌ఈడీ బల్బుల వెలుగులు మొక్కలకు అవసరమైన శక్తిని అందిస్తాయి. ఇలాంటి నిట్టనిలువు వ్యవసాయం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. నీటిని అత్యంత పొదుపుగా సమర్థంగా వాడుకోవడం ఒకటైతే.. క్రిమికీటకాల బెడద అస్సలు ఉండదు కాబట్టి అందుకు తగ్గట్టుగానే ఎరువులు, కీటకనాశినుల వాడకం కూడా అవసరముండదు. ఎల్‌ఈడీ బల్బుల కోసం.. ఇతర అవసరాలన్నింటి కోసం భవనం పైకప్పుపై దాదాపు 2003 సోలార్‌ ప్యానెళ్లతో 500 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.


వర్టికల్‌ ఫార్మింగ్‌కు సూర్యరశ్మిని అందించే సోలార్‌ ప్యానెళ్లు

ఇప్పటివరకూ ఏర్పాటైన అనేక వర్టికల్‌ ఫార్మ్‌లకు దీనికీ ఇంకో ప్రధానమైన తేడా ఉంది. తక్కిన వాటిల్లో కేవలం ఆకుకూరలు మాత్రమే పండేవి. కానీ తాము టెక్నాలజీలో కొన్ని మార్పులు చేయడం ద్వారా దాదాపు అన్ని రకాల పంటలూ పండించగలుగుతున్నామని అంటున్నారు మెట్రోపోలిస్‌ ఫార్మ్‌ యజమానులు. టమోటాలు, స్ట్రాబెర్రీలు, దోసకాయలతోపాటు వీరు ఆకుకూరలు కూడా పండిస్తున్నారు.! నగరం నడిబొడ్డున 660 ఎకరాలకు సరిపడా పంట పండితే.. కాయగూరలను పల్లెల నుంచి నగరాలకు తీసుకు రావాల్సిన అవసరం తప్పుతుంది కాబట్టి అంతమేరకు ఆదా చేయవచ్చునన్నది వీరి ఆలోచన.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Videos

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)