amp pages | Sakshi

నిర్బంధంపై కోర్టుకు..

Published on Wed, 02/22/2017 - 10:12

లాహోర్‌: పాకిస్తాన్‌ ప్రభుత్వం తమను గృహనిర్బంధం చేయడంపై జమాత్‌ ఉద్‌ దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ సహా మరో నలుగురు లాహోర్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. బుధవారం ఈ పిటిషన్‌ విచారణకు రానుంది. సీనియర్‌ న్యాయవాది ఏకే దోగర్‌ ద్వారా హఫీజ్‌ సయీద్‌, మాలిక్‌ జాఫర్‌ ఇక్బాల్‌, అబ్దుర్‌ రహమాన్‌, మాలిక్‌ జాఫర్‌ రెహమాన్‌ అబిద్‌, కాజీ కషీఫ్‌ హుస్సేన్‌, అబ్దుల్లా ఉబాయిద్‌ల నిర్బంధాన్ని కోర్టులో చాలెంజ్‌ చేశారు. గృహనిర్బంధంపై ఫిబ్రవరి ప్రారంభంలోనే పిటిషన్‌ దాఖలు చేసినా టెక్నికల్‌ గ్రౌండ్స్‌ లేకపోవడం లాహోర్‌ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.
 
ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద సయాద్‌, మరో నలుగురిని పాకిస్తాన్‌ ప్రభుత్వం గృహనిర్బంధం చేసింది. మంగళవారం సయీద్‌కు ఉన్న ఆయుధ లైసెన్స్‌లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూఎన్‌ కౌన్సిల్‌ ఆదేశాల మేరకే సయీద్‌ను 90రోజుల పాటు గృహనిర్బంధం చేస్తున్నట్లు పాకిస్తాన్‌ హోం శాఖ మంత్రి చౌదరి నిసార్‌ అలీ ఖాన్‌ తెలిపారు. కాగా, పలు దేశాల్లో జరిగిన ఉగ్రదాడులకు కారణం సయీద్‌ అనే ఆరోపణలు ఉన్నాయి. 2008 ముంబై ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌ సయీద్‌ను నిర్బంధించింది. అప్పట్లో లాహోర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసిన సయీద్‌.. నిర్బంధం నుంచి బయటకు వచ్చాడు. అమెరికాలో సయీద్‌పై రూ.10 లక్షల డాలర్ల రివార్డు ఉంది.

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

తాగుడుకు బానిసైన హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)