amp pages | Sakshi

పొగను పీల్చుకునే ఫ్యాక్టరీ

Published on Sat, 06/03/2017 - 00:29

‘ఏంటి...? గాల్లో కార్బన్‌డైయాక్సైడ్‌ పెరిగిపోతోందా? అయితే పీల్చేస్తే పోలా’ అంటోంది క్లైమ్‌ వర్క్స్‌. అనడం మాత్రమే కాదు.. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఉన్న ఈ కంపెనీ ఇందుకోసం ఓ ఫ్యాక్టరీ కూడా పెట్టేసింది. చెత్తను మండించే ఫ్యాక్టరీ పైకప్పుపై దీన్ని ఏర్పాటు చేశారు. కింద చెత్తను మండించినప్పుడు వెలువడే గాలిని పీల్చేసుకుని అందులోంచి కార్బన్‌డైయాక్సైడ్‌ను ఇది వేరుచేస్తుంది. మిగిలినదాన్ని వదిలేస్తుంది. ఫొటోల్లో కనిపిస్తున్నది ఆ ఫ్యాక్టరీ చిత్రాలే. వాతావరణంలో గ్రీన్‌హౌస్‌ వాయువులు పెరిగిపోయి భూగోళం వేడెక్కుతోందని, ఫలితంగా అనేక దుష్పరిణామాలు ఎదురు కానున్నాయని తరచూ వింటూ ఉన్నాం.

ఈ శతాబ్దం అంతానికి భూతాపోన్నతిని రెండు డిగ్రీల కంటే తక్కువగానే ఉంచాలని ప్రపంచదేశాలు కూడా ప్యారిస్‌ ఒప్పందం ద్వారా అంగీకరించాయి. ఈ నేపథ్యంలోనే క్లైమ్‌ వర్క్స్‌ అభివృద్ధి చేసిన ఈ ఫ్యాక్టరీకి ప్రాముఖ్యం ఏర్పడింది. మూడు షిప్పింగ్‌ కంటెయినర్ల సైజుండే ఈ ఫ్యాక్టరీ ఏడాదికి 900 టన్నుల కార్బన్‌డైయాక్సైడ్‌ను వేరు చేయగలదు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా ఓ 7.50 లక్షలు ఏర్పాటు చేస్తే భూతాపోన్నతిని విజయవంతంగా అడ్డుకోవచ్చునని అంటున్నాడు... క్లైమ్‌ వర్క్స్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫ్‌ గెబాల్డ్‌. బాగానే ఉందిగానీ.. వేరు చేసిన కార్బన్‌డైయాక్సైడ్‌ వాయువును ఏం చేయాలి? అని ప్రశ్నిస్తే.. అబ్బో అందుకు బోలెడు మార్గాలు ఉన్నాయంటున్నారు ఆయన.

‘‘మా ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే వాయువును అరకిలోమీటర్‌ దూరంలో ఉన్న ఓ గ్రీన్‌హౌస్‌కు అమ్ముతున్నాం. వాళ్లు దాన్ని పంటలు ఏపుగా పెరిగేందుకు వాడుతున్నారు’’ అంటారు ఆయన. దీంతోపాటు ఈ వాయువును కూల్‌డ్రింక్స్, లేదా ఇంధనం తయారీకి కూడా వాడుకోవచ్చునని చెబుతున్నారు.  ఇంకో ఎనిమిదేళ్లకు అంటే...  2025 నాటికల్లా భూమ్మీద ఉన్న గాలిలో కనీసం ఒకశాతాన్ని శుద్ధి చేయాలన్నది క్లైమ్‌ వర్క్స్‌’ లక్ష్యమట! గుడ్‌లక్‌ చెప్పేద్దాం! 
 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?