amp pages | Sakshi

అల్లాడుతున్న తెలుగు కుటుంబాలు

Published on Sun, 09/10/2017 - 04:07

సాక్షి, హైదరాబాద్‌:  అమెరికాలో ఇర్మా హరికేన్‌ ధాటికి వేల సంఖ్యలో తెలుగు కుటుంబాలు అల్లాడుతున్నాయి. ఒక్క ఫ్లోరిడాలోనే దాదాపు ఆరు వేల వరకు తెలుగు కుటుంబాలున్నాయి. తీర ప్రాంతాల్లో ఇర్మా ప్రభావం తీవ్రంగా ఉండటంతో అక్కడి అధికారులు ప్రజలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో నిరాశ్రయు లైన తెలుగు ప్రజలకు ఇతర రాష్ట్రాలు, నగరాల్లోని తెలుగువారు బాసటగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఫ్లోరిడా నుంచి దాదాపు వెయ్యి తెలుగు కుటుం బాలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లినట్టు తెలుస్తోంది.

అక్కడి తెలుగు సంఘాలు అప్రమత్తమై ఇర్మా బాధితుల్లో ఉన్న తెలుగువారి జాడ కోసం ప్రయత్నిస్తున్నాయి. సమీపంలోని ఇతర నగరాల్లో ఉన్న తెలుగువారితో సంప్రదించి వీలైనంత ఎక్కువ మందికి ఆశ్రయం కల్పించేలా చూస్తున్నాయి. ఇక వేరే నగరాల్లోని స్నేహితులు, బంధువుల వద్దకు వెళ్తున్నవారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక గవర్నర్‌ రిక్‌ స్కాట్‌ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత కేంద్రాల్లో దాదాపు 50 వేల మంది వరకు తలదాచుకుంటున్నారు. ఇందులో కొన్ని తెలుగు కుటుంబాలు కూడా ఉన్నాయి. ప్రాణనష్టం లేకుండా యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది.

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)