amp pages | Sakshi

కేలరీలను ఇట్టే పట్టేస్తుంది

Published on Sun, 10/15/2017 - 01:20

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ డయాబెటిక్‌ పేషెంట్లు పెరిగిపోతున్నారు. వీరిలో డైట్‌ను ఫాలో అయ్యేవారు, అవ్వాలనుకునేవారు చాలామందే ఉంటారు. ఇలాంటి వారందరికీ ఎంత తినాలో.. ఏం తినాలో సరైన ఐడియా ఉండదు. ముఖ్యంగా రెస్టారెంట్లు, బయటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆహారం విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అక్కడ పెట్టే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో.. న్యూట్రిషనల్‌ వ్యాల్యూస్‌ ఏంటో తెలియక ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు.

వీరి కోసం కేలరీ, న్యూట్రిషనల్‌ క్యాలుక్యులేటర్లు ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒక అంచనాకు మాత్రమే పనికొస్తాయి. అయితే ఈ ఫొటోలోని పానాసోనిక్‌ వారి కేలోరికో అనే కొత్త పరికరం ప్లేట్‌లో ఉండే ఆహారం ఎన్ని కేలరీలు ఉందో సెకన్లలోనే కచ్చితంగా లెక్కించగలదట.. మనలో చాలామంది ఇప్పటికే కేలరీ క్యాలుక్యులేటర్లను వినియోగించే ఉంటారు. కానీ అవన్నీ సాధారణంగా ప్రాథమిక సమాచారం మాత్రమే ఇస్తాయి.

ఉదాహరణకి ఒక బర్గర్‌లో ఎన్ని కేలరీలు ఉండొచ్చో అంచనాగా చెబుతాయి. కానీ కేలరికో మాత్రం ప్లేట్‌లో ఉన్న బర్గర్‌ కచ్చితంగా ఎన్ని కేలరీలు ఉందో చెప్పగలదు. ఈ పరికరాన్ని సీటెక్‌–2017 టెక్నాలజీ సదస్సులో ప్రదర్శించారు. ఈ పరికరం లైట్‌ రిఫ్లెక్షన్‌ టెక్నాలజీని ఉపయోగించి ప్లేట్‌లో ఉన్న ఆహారంలోని పౌష్టికాల విలువను కచ్చితంగా చెబుతుంది. చేయాల్సిందల్లా ప్లేట్‌లోని ఆహారాన్ని ఈ పరికరంతో ఫొటోలో చూపిన విధంగా పది నుంచి 20 సెకన్లు ఉంచాలి. ఆహారాన్ని లెక్కించిన తర్వాత ఎన్ని కేలరీలు, పౌష్టిక గుణాలను ఎల్‌ఈడీ డిస్‌ప్లేలో ఇట్టే చూపెడుతుంది.

అయితే ప్రస్తుతానికిది సూప్‌లు, ఇతర డార్క్‌ డిష్‌లు మినహా అన్ని రకాల ఆహార పదార్థాలను గుర్తిస్తుంది. ఈ పరికరాన్ని యాప్‌ ద్వారా మన స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని డయాబెటిక్‌ రోగుల కోసం ప్రత్యేకంగా తయారు చేశామని పానాసోనిక్‌ కంపెనీ వారు చెబుతున్నారు. ఈ పరికరం మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ఇంకొన్నేళ్లు ఆగాలని చెబుతున్నారు. అలాగే దీని ధర ఎంత ఉండచ్చో కంపెనీ తెలపలేదు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)