amp pages | Sakshi

లాడెన్‌ కొడుకు ఎలా ఎంజాయ్‌ చేసేవాడంటే..?

Published on Mon, 01/09/2017 - 18:24

న్యూయార్క్‌: ఆల్‌ కాయిదా మాజీ చీఫ్‌ ఒసామా బిన్‌లాడెన్‌ కుమారుడు హంజాబిన్ లాడెన్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అమెరికా అంటేనే హంజా పళ్లు పటపట కొరుకుతాడని, అసలు ఆ దేశం పేరు చెబితేనే కళ్లెర్ర జేస్తాడని కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అలాంటి అతడు అమెరికా వస్తువులను ఎంజాయ్‌ చేస్తూ కనిపించాడు. అమెరికాకు చెందిన కోకాకోలాను ఉపయోగించడంతోపాటు ఇతర అమెరికా వస్తువులను కూడా వాడుతూ ఎంజాయ్‌ చేసేవాడట.

హంజా చిన్నవయసులో ఉండగా అఫ్గనిస్థాన్‌లో అతడు ఉంటున్న ఇంటి కాంపౌండ్‌లో చాలా వస్తువులు అమెరికావే కనిపించేవని సమాచారం. ‘ఒసామాకు ముద్దుల కొడుకు అయిన హంజా అమెరికాను అసహ్యించుకుంటాడేమోకానీ, అమెరికా వస్తువులను కాదు. ఎందుకంటే అతడి ఇంటి కాంపౌండ్‌లో ఎప్పుడూ కోకాకోలావంటి వస్తువులు కనిపిస్తుండేవి’ అని హంజా చిన్ననాటి స్నేహితుడు అబ్దురహమాన్‌ ఖాదర్‌ చెప్పినట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ వెల్లడించింది. అతడు మూడేళ్లు హంజాతో కలసి  ఉన్నాడు. సాధారణంగా ఇంట్లోకి అలాంటి వస్తువులను అనుమతించేవారు కాదని, కానీ హంజా మాత్రం ప్రతి రోజు వాటిని దొంగచాటుగా తెప్పించుకునే వాడని అతడు తెలిపాడు. అమెరికాకు చెందిన పొగాకు ఉత్పత్తులను కూడా అతడు తొమ్మిదేళ్ల ప్రాయంలో తీసుకొచ్చేవాడని చెప్పారు.

ఇటీవల లాడెన్‌ కొడుకు హంజాబిన్ లాడెన్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా అమెరికా ప్రకటించింది. హంజాబిన్ వయసు 20 ఏళ్లు మాత్రమే. ఇతనిపై సెక్షన్ 1 కింద ఆంక్షలు విధించింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13224 ప్రకారం అమెరికా రక్షణ, భద్రత కోసం హంజాబిన్ తో లావాదేవీలన్నింటినీ నిషేధించింది. హంజాబిన్ ను ఆల్ ఖైదా సభ్యుడిగా ఆ సంస్థ నేత అల్ జవహరి 2015 ఆగస్ట్ 14న ప్రకటించాడు. ఆ తర్వాత హంజాపై నిఘా పెట్టిన అమెరికా ఉగ్రవాద కార్యకలాపాల్లో అతను చురుకుగా పొల్గొంటున్నాడని నిర్ధారణకు వచ్చి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)