amp pages | Sakshi

ఐర్లండ్‌ ప్రధానిగా భారత్‌ సంతతి నేత

Published on Sat, 06/03/2017 - 01:14

► అధికార పార్టీ ఎన్నికల్లో లియో వారడ్కర్‌ గెలుపు
►  తొలి ‘గే’, పిన్నవయస్కుడైన ప్రధానిగా రికార్డు  

డబ్లిన్‌: ఐర్లండ్‌ తదుపరి ప్రధానిగా భారత సంతతికి చెందిన లియో వారడ్కర్‌ (38) ఎంపికయ్యారు. ప్రస్తుత ప్రధాని ఎండా కెన్నీ రాజీనామాతో జరిగిన అధికార ఫైన్‌ గేల్‌ పార్టీ అంతర్గత ఎన్నికలో 60 శాతం ఓట్లతో వారడ్కర్‌  గెలిచారు. ఐర్లండ్‌కు అత్యంత పిన్న వయస్కుడైన, తొలి మైనార్టీ ప్రధానిగా నిలిచారు. తొలి స్వలింగ సంపర్క (గే) ప్రధానిగానూ రికార్డులకెక్కారు.

ప్రధాని పదవికి పార్టీ సీనియర్‌ నేత సిమన్‌ కోవెనీ, వారడ్కర్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానిగా ఎంపికవటంపై వారడ్కర్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘నేను సగం భారతీయుడిని, డాక్టర్‌ను, గే పాలిటీషియన్‌ని మాత్రమే కాదు. నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుంది’ అని  అన్నారు. జూన్‌ 13న జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ఆయన అధికారికంగా బాధ్యతలు అందుకోనున్నారు.

ముంబైలో మూలాలు..
ముంబై నుంచి వచ్చి స్థిరపడిన హిందూ, మçహారాష్ట్రీయుడైన డాక్టర్‌ అశోక్‌ వారడ్కర్, ఐరిష్‌ నర్స్‌ మీరియమ్‌ మూడో సంతానమే లియో.  66 లక్షల జనాభా ఉన్న ఈ చిన్న దేశంలో టీషక్‌ (ప్రధాని) పదవికి ఆసియా మూలాలున్న ‘గే’ను ఎన్నుకోవడం పదేళ్ల కిందటి వరకు ఊహకు అందని విషయం. వారడ్కర్‌.. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీలో మొదట లా కోర్సులో చేరినా, వెంటనే మెడిసిన్‌కు మారారు. 2003లో మెడిసిన్‌ పూర్తిచేశారు. అదే ఏడాది ఫింగల్‌ కౌంటీ కౌన్సిల్‌కు లియోను ఫైన్‌ గేల్‌ పార్టీ కోఆప్ట్‌ చేయడంతో రాజకీయ ప్రయాణం గాడినపడింది. 2007లో డబ్లిన్‌ వెస్ట్‌ స్థానం నుంచి ఐర్లండ్‌ దిగువసభకు ఎన్నికై, మంత్రిగా సని చేశారు. కుంభకోణాల ఫలితంగా ప్రధాని కెన్నీ రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది.

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

తాగుడుకు బానిసైన హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)