amp pages | Sakshi

గాంధీజీ విగ్రహ నిర్మాణానికి నిరసన సెగ

Published on Thu, 11/01/2018 - 08:53

లిలాంగ్వే, మలావి : తూర్పు ఆఫ్రికా దేశమైన మలావి వాణిజ్య రాజధాని కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపి వేయాలని అక్కడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 10 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో ఈ విగ్రహాన్ని ఢిల్లీకి చెందిన ఓ సంస్థ నిర్మిస్తోంది. గాంధీజీ.. తన జీవితంలో ఎక్కువ కాలం జాత్యహంకారాన్ని ప్రదర్శించడానికే వెచ్చించారని, అటువంటి వ్యక్తి విగ్రహాన్ని రాజధానిలో నిర్మించడం సబబు కాదని..‘ గాంధీ మస్ట్‌ ఫాల్‌​’ గ్రూప్‌ సభ్యులు కోర్టుకు విన్నవించారు.

అంతేకాకుండా.. ‘నల్లజాతీయులైన తమకు గాంధీ వల్ల ఎటువంటి లాభం చేకూరలేదు సరికదా, ఆ భావన మాలో మరింత బలంగా నాటుకుపోయింది’ అంటూ మరో పద్దెనిమిది అభ్యంతరాలతో కూడిన లేఖను కోర్టుకు అందజేశారు. సుమారు 3 వేల మంది మలావియన్స్‌ సంతకం చేసిన ఈ లేఖను, వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు విగ్రహ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఆఫ్రికా దేశాల్లో గాంధీ విగ్రహ నిర్మాణానికి నిరసన సెగ తగలడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి. 2016లో ఘనాలోని ఓ యూనివర్సిటీలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఘనా ప్రభుత్వం ప్రయత్నించగా.. గాంధీజీని జాత్యహంకారిగా అభివర్ణిస్తూ అక్కడి విద్యార్థులు, ప్రొఫెసర్లు నిరసన తెలియజేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మరో చోట విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించింది. శాంతి, అహింసా మార్గాలతో భారతదేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తి చేసేందుకు తన జీవితాన్ని ధారపోసిన గాంధీజీ.. తొలి ఉద్యమం దక్షిణాఫ్రికాలో మొదలైందన్న విషయం తెలిసిందే. అయితే ఆఫ్రికా దేశాల్లోని కొంతమంది ప్రజలు మాత్రం ఆయనను ఓ జాత్యహంకారిగా, తమ మధ్య విభేదాలు సృష్టించిన వ్యక్తిగా ద్వేషిస్తూ ఉంటారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌