amp pages | Sakshi

మొస‌లిని ఎత్తుకుని రెస్టారెంట్‌కు వెళ్లి..

Published on Fri, 06/12/2020 - 19:56

ఫ్లోరిడా: పామును ప‌ట్టాలంటే ధైర్యం ఉండాలి, మ‌రి మొస‌లిని ప‌ట్టాలంటే.. అంత‌కు రెట్టింపు గుండె ధైర్యం అవ‌స‌రం. అలాంటిది.. ఓ వ్య‌క్తి చంటిపిల్లాడిని చంకనేసుకుని వెళ్లిన‌ట్లుగా మొస‌లిని భుజానికేసున్నాడు. ఓ టిక్‌టాక్ యూజ‌ర్ ఈ వీడియోను షేర్ చేయ‌గా విప‌రీతంగా వైరల్ అవుతోంది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన‌ ఓ వ్య‌క్తి మొస‌లిని పెంచుకుంటున్నాడు. దానికి ముద్దుగా స్వీటీ అని పేరు పెట్టుకున్నాడు. అందంగా క‌నిపించేందుకు ఎల్లో టీ ష‌ర్ట్ కూడా వేసాడండోయ్‌. దాన్ని ఎత్తుకోగానే అది కూడా ఆనందంగా తోకూపుతూ బుద్ధిగా న‌డుచుకుంది. అనంత‌రం అత‌డు దాన్ని తీసుకుని రెస్టారెంట్ లోప‌లికి వెళ్లాడు. (బ‌ర్త్‌డే: కిటికీలో నుంచి దూకుతూ)

కాగా ఈ స్వీటీ అడ‌విలో గాయ‌ప‌డ్డ స్థితిలో మోర్ హెడ్ అనే వ్య‌క్తి కంట ప‌డింది. దీంతో అత‌డు దాన్ని ర‌క్షించి సాయం అందించాడు. అదే స‌మ‌యంలో మొస‌లికి క‌ళ్లు క‌నిపించ‌వు అని తెలిసింది. అలాంటి దీన స్థితిలో మొస‌లిని అడ‌విలో వ‌దిలిపెట్టడానికి అత‌నికి మ‌న‌సొప్ప‌లేదు. దీంతో దాన్ని ఇంటికి తీసుకు వ‌చ్చి క‌న్న‌బిడ్డ‌లా పెంచుకుంటున్నాడు. టిక్‌టాక్‌లో లైకుల వ‌ర్షం కురిపిస్తున్న ఈ వీడియోను చూసి కొంద‌రు అబ్బుర‌ప‌డుతుంటే మ‌రికొంద‌రేమో భ‌యంతో వ‌ణికిపోతున్నారు. (హిట్ల‌ర్ పెంచుకున్న మొస‌లి ఇదేనా?)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)