amp pages | Sakshi

భూ..కోపం!

Published on Wed, 05/13/2015 - 02:41

* నేపాల్‌లో మళ్లీ భారీ భూకంపం
* 50 మంది మృతి, 1,100 మందికి గాయాలు
* రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదు
* మూడు వారాల్లోనే రెండోసారి విలయం

 
భూవిలయంతో కకావికలమైన నేపాల్‌ను 3 వారాలు తిరగకముందే మరో భారీ భూకంపం తాకింది. నాటి పెను భూకంపం 8,000 మందికి పైగా బలితీసుకోగా.. ఆ మహా విషాదం, అది సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకోలేకపోతున్న ఈ హిమాలయ దేశంలో మంగళవారం మళ్లీ భారీ భూ కంపం సంభవించి మరో 50 మంది ప్రాణాలను బలిగొంది. మరో 1,117 మంది గాయాలపాలయ్యారు. రాజధాని కఠ్మాండు నగరానికి తూర్పుగా 83 కిలోమీటర్ల దూరంలో ఎవరెస్ట్ పర్వతం సమీపంలో భూమికి కేవలం 15 కిలోమీటర్ల తక్కువ లోతులో వచ్చిన తాజా భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3 గా నమోదైంది.
 
 కఠ్మాండు: భూ విలయంతో కకావికలమైన నేపాల్‌ను మూడు వారాలు తిరగకముందే మరో భారీ భూకంపం తాకింది. నాటి పెను భూకంపం 8,000 మందిని పైగా బలితీసుకోగా.. ఆ మహావిషాదం, అది సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకోలేకపోతున్న ఈ హిమాలయ దేశంలో మంగళవారం మళ్లీ భారీ భూకంపం సంభవించి మరో 50 మంది ప్రాణాలను బలిగొంది. మరో 1,117 మంది గాయాలపాలయ్యారు. కఠ్మాండు నగరానికి తూర్పుగా 83 కిలోమీటరల దూరంలో ఎవరెస్ట్ పర్వతం సమీపంలో భూమికి కేవలం 15 కి.మీటర్ల తక్కువ లోతులో వచ్చిన తాజా భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3 గా నమోదయింది. మధ్యాహ్నం 12.35 గంటలకు సంభవించిన ఈ భూకంపం.. గత భూకంపానికి తీవ్రంగా దెబ్బతిన్న దోలఖా, సింధుపాల్‌చౌక్ జిల్లాలను మళ్లీ దెబ్బతీసింది. మరిన్ని భవనాలు కుప్పకూలాయి.
కొండచరియలు విరిగిపడ్డాయి.

గత భూకంపం తరహాలోనే తాజా భూకంపం కూడా భారత్‌పైనా ప్రభావం చూపింది. బిహార్‌లో 15 మంది చనిపోయారు. చైనా పరిధిలోని టిబెట్‌లో భూకంపం వల్ల ఒక మహిళ చనిపోయారు. గత నెల 25న రిక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతతో సంభవించిన పెను భూకంపం నేపాల్‌ను అతలాకుతలం చేసి గ్రామాలను మట్టిదిబ్బలుగా మార్చడం తెలిసిందే. తర్వాతి భారీ భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఆరుబయటే నివసిస్తున్నారు. మంగళవారం సంభవించిన భారీ భూకంపం వారిని హతాశులను చేసింది. ఆ తర్వాత కూడా రిక్టర్ స్కేలుపై 5 కన్నా ఎక్కువ తీవ్రతతో 6 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. కాళ్ల కింద నేల కదిలిపోతోంటే ప్రాణాలు దక్కించుకునేందుకు తలో దిక్కుకు పరుగులు తీశారు. నాటి భూకంపంలో నేలమట్టమైన కఠ్మాండు మరోసారి వణికిపోయింది. ఇళ్లలో ఉన్న ప్రజలు ఆర్తనాదాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు.  
 
 భూ ప్రకంపనలు కొనసాగుతుండటంతో ప్రజలు ఆరుబయటే కాలం గడుపుతున్నారు.  అందుబాటులో ఉన్న హెలికాప్టర్లన్నిటినీ, వైద్య బృందాలను భూకంప  ప్రాంతాలకు పంపిస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం తెలిపింది. త్రిభువన్‌దాస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొద్దిసేపు మూసివేశారు. కఠ్మాండు రావలసిన విమానాలు కొన్నిటిని దారి మళ్లించారు. మరోవైపు.. నేపాల్‌లోనే సహాయ చర్యల కోసం ఉంచిన భారత వైమానికి దళానికి చెందిన 8హెలికాప్టర్లను కూడా సహాయ చర్యలకు వినియోగించనున్నారు. భూకంపం సంభవించిన వెంటనే.. వీటిలో ఒక హెలికాప్టర్ ద్వారా ప్రభావిత ప్రాంతాలను గగనతలం నుంచి పరిశీలించారు. భారత సైన్యం సహాయ చర్యల్లో నేపాల్ సైన్యంతో కలిసి పనిచేస్తోందని అధికారిక ప్రకటనలో తెలిపింది. హెలికాప్టర్ సాయంతో 27 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించింది. 

#

Tags

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)