amp pages | Sakshi

‘నమ్మండిరా బాబు.. నిజంగా నేనే’

Published on Mon, 12/03/2018 - 17:52

అబుజా : ‘చావుపుట్టుకలు దైవాధీనం’.. ఇది ఒకప్పటి మాట. మరి నేడో.. రేటింగ్స్‌ కోసం.. పాపులారిటీ కోసం.. సోషల్‌ మీడియా సాక్షిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరినైనా  చంపేస్తున్నాం. పాపం ఆనక సదరు వ్యక్తులు ‘బాబోయ్‌ మేం బతికే ఉన్నాం’ అంటూ టీవీల ముందుకు వచ్చి మొరపెట్టుకోవాల్సి వస్తోంది. ఇలాంటి  పరిస్థితే ఎదురయ్యింది నైజీరియా అధ్యక్షుడు బుహారికి. మీడియా ముందుకు వచ్చి ‘నేను బతికే ఉన్నాను.. నేను నేనే. నన్ను నమ్మండి’ అంటూ వాదించాల్సిన పరిస్థితి ఎదురయ్యింది బుహారికి.

విషయం ఏంటంటే గత ఏడాది గుర్తు తెలియని వ్యాధి చికిత్స నిమిత్తం లండన్‌ వెళ్లారు బుహారి. ఎక్కువ రోజులు అక్కడే ఉన్నారు. కొన్నాళ్ల క్రితమే తిరిగి స్వదేశాని​కి వచ్చారు. కానీ ఈ లోపే ఆయన చనిపోయినట్లు.. ఆ స్థానంలో బుహారిని పోలిన మరో వ్యక్తి పరిపాలన సాగిస్తున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేసాయి. పొరుగున ఉన్న సూడాన్ నుంచి అచ్చం బుహారి లాంటి వ్యక్తినే తెచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనే  గాసిప్స్ తారస్థాయికి చేరాయి. అంతటితో ఆగక ఆ వ్యక్తి పేరు జబ్రిల్ అని చెప్పుకోవడం మరింత ఆశ్చర్యకరమైన అంశం. స్వదేశాని​కి వచ్చిన బుహారికి ఈ వదంతుల గురించి తెలిసింది కానీ పెద్దగా పట్టించుకోలేదు.

ఈ క్రమంలో వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు పోలండ్ వెళ్లిన బుహారీ ప్రవాస నైజీరియన్లను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడికి వచ్చిన అతిథులందరూ ఇతర విషయాలను వదిలేసి ఈ వదంతుల గురించి ప్రస్తావించడంతో ఆయన ‘నేనే బాబూ.. బతికే ఉన్నాను.. డమ్మీని కాను’ అని చెప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాక తన గురించి ఇలాంటి వదంతులు ప్రచారం చేసిన వారు అజ్ఞానులు, మతం పట్ల గౌరవం లేనివాళ్లంటూ ఆయన మండిపడ్డారు. వచ్చే ఏడాది అధ్యక్ష పదవికి తిరిగి పోటీచేయాలని భావిస్తున్నారు బుహారీ. దాంతో ప్రత్యర్ధులు ఆయనకు వ్యతిరేకంగా ఇలాంటి వదంతులు వ్యాపింపచేశారు. బుహారి లండన్‌లో ఎక్కువ రోజులు గడపడం కూడా వారికి ఉపయోగపడింది. అయితే బుహారి ఇప్పటి వరకూ ఆయనకు ఉన్న వ్యాధి ఏమిటో వెల్లడించ లేదు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)