amp pages | Sakshi

వెలుగులోకి ఒబామా ట్రాజెడీ లవ్‌స్టోరీ

Published on Thu, 05/04/2017 - 13:33

వాషింగ్టన్‌: తన భార్యతో ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా మెలిగే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా జీవితంలో మిషెల్లీ రాకముందు బయటి ప్రపంచానికి తెలియని మరో స్త్రీ ఉన్నారు. షీలా మియోషి జాగర్‌ అనే మహిళ మిషెల్లీ రాకముందు ఒబామా ప్రేయసిగా ఉన్నారు. ఈ విషయం త్వరలో రాబోతున్న ఒబామా జీవిత చరిత్ర ద్వారా బయటి ప్రపంచానికి తెలియబోతుంది. ‘రైజింగ్‌ స్టార్‌: ది మేకింగ్‌ ఆఫ్‌ బరాక్‌ ఒబామా’  అనే పేరిట ఒబామా జీవిత చరిత్ర రాస్తున్న ప్రముఖ రచయిత డేవిడ్‌ జే గారో ఈ రహస్యాన్ని, మరెన్నో అంశాల్ని అందులో ప్రస్తావించారు.

ఈ పుస్తకంలో ఆయన పేర్కొన్న ప్రకారం జాగర్‌ రచయిత డేవిడ్‌కు ఏం చెప్పిందంటే..‘1986 వింటర్‌ సమయంలో మేం మా తల్లిదండ్రులను కలిసేందుకు వెళ్లినప్పుడు ఒబామా నాకు పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఆయనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. కానీ మా కలయికను మా అమ్మనాన్నలు అంగీకరించలేదు. ఎందుకంటే నేను ఆ సమయంలో ఒబామాకంటే రెండేళ్లు చిన్నదాన్ని. పైగా ఒబామాకు రాజకీయాలపై ఆలోచన ఉండేది. ఆతడి రాజకీయ ఆలోచనలు గాడిలో పడటం మొదలైంది. క్రమంలో అతడు రాజకీయాల్లోకి జారుకున్నాడు. రాజకీయాలతోపాటు, జాతి వివక్ష అంశం కూడా మా సంబంధంపై నీలినీడల్లా కమ్ముకుని విడిపోయాం. ఒక్క ఏడాదిలోనే మా రిలేషన్‌పై ప్రభావం పడింది. 1987ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అధ్యక్ష పదవి చేజిక్కించుకునే విషయంలో ఒబామాకు అప్పట్లోనే స్పష్టమైన ముందుచూపు, అంచనాలు ఉన్నాయి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఒబామా హార్వార్డ్‌లో విద్యను పూర్తి చేసిన తర్వాత చికాగో తిరిగొచ్చి స్థానిక న్యాయ సంస్థలో ఉద్యోగంలో చేరాడని, అక్కడే ఆయనకు మిషెల్లీ ఒబామా కలిసిందని, వారి సంబంధం అతి తక్కువ కాలంలో ధృడపడి వివాహానికి దారి తీసిందని కూడా వెల్లడించింది. అంతేకాదు, ఆమె హార్వార్డ్‌లో ఫెలోషిప్‌ టీచింగ్‌కు వచ్చిన సమయంలో కూడా ఒబామా తనను చూసేవాడని తెలిపింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)