amp pages | Sakshi

ఈక్వెడార్‌లో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక

Published on Sun, 04/17/2016 - 07:32

ఈక్వెడార్‌ రాజధాని క్వీటోను కుదిపేసిన భారీ భూకంపం
♦ భూకంప ధాటికి 28 మంది దుర్మరణం
♦ రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదు
♦  తొలుత భూకంప తీవ్రత 4.8 గా నమోదు
తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికల జారీ

ఈక్వెడార్‌: ఈక్వెడార్‌ రాజధాని క్వీటోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్టు అమెరికా జీయోలాజికల్‌ సర్వే వెల్లడించింది. రాజధాని క్వీటోలో భూప్రకంపనల తీవ్రత బలంగా ఉండటంతో అక్కడి ప్రాంతీయ తీరప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో శనివారం (స్థానిక కాలమానం)11. 58 గంటల ప్రాంతంలో భారీగా భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ఈ  భూకంప ధాటికి 28 మంది దుర్మరణం చెందినట్టు పేర్కొంది.

క్వీటోకు పశ్చిమ-వాయువ్యంగా 173 కిలోమీటర్ల దూరంలో 11.58 గంటల ప్రాంతంలో ఏర్పడగా, మరో చోట ఆగ్నేయ దిశగా మూస్నేకు 28 కిలోమీటర్ల దూరంలో భూప్రకపంనలు చోటుచేసుకున్నట్టు పేర్కొంది. 11 నిమిషాల కాల వ్యవధిలో ఒకే ప్రాంతంలో రెండు భూకంపాలు కుదిపేసినట్టు యూస్‌జీయస్‌ వెల్లడించింది. తొలుత భూకంప తీవ్రత 4.8 గానూ, రెండో భూకంప తీవ్రత 7.8 గా నమోదైనట్టు తెలిపింది. ఈ భూకంప ధాటికి క్వీటోలో భవనాలు ధ్వంసం కాగా, 28 మంది మృత్యువాత పడినట్టు ఆ దేశ ఉపాధ్యక్షుడు జార్జ్‌ గ్లాస్‌ పేర్కొన్నారు. గుయాస్‌లో ఇద్దరు, పోర్ట్‌వ్యిజో నగరంలో 16 మంది, మాంటాలో 10 మంది మృతిచెందినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు జార్జ్‌ పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

కాగా, జపాన్‌లో రెండ్రోజుల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ భూకంప ధాటికి మృతుల సంఖ్య 41కు పెరిగగా, 1500 మంది గాయపడ్డారు. క్యుషు ద్వీపంలోని కుమమొటో ప్రాంతాన్ని శనివారం తెల్లవారుజామున (స్థానిక కాలమానం) 1.30 నిముషాలకు మరో భూకంపం కుదిపేయడంతో 32 మందికి మరణించిన సంగతి విధితమే.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)