amp pages | Sakshi

చిలుక పలుకులకు కారణం తెలిసింది..

Published on Fri, 06/26/2015 - 16:05

వాషింగ్టన్: 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అని వేమన చెప్పిన మాదిరి పక్షుల్లో కూడా చిలుకలది ప్రత్యేక స్థానం. ఎందుకంటే మిగిలిన పక్షులకు వేటికీ లేనిదీ, చిలుకలకు మాత్రమే సొంతమైన సామర్థ్యం మాట్లాడగలగడం. వీటికి ఆ ప్రత్యేకత ఎందుకు వచ్చిందో వాషింగ్టన్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. చిలుకల మెదడులో ఉండే ప్రత్యేకమైన అసమాంతర నిర్మాణాలే మనుషులు చేసే శబ్దాలను అవి అనుకరించడానికి కారణమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మిగిలిన పక్షుల్లో వేటికీ ఇలాంటి ప్రత్యేక నిర్మాణాలు లేవని తెలిపారు. వీటిపై గత 34 ఏళ్లుగా అధ్యయనాలు జరుగుతున్నా ఈ ప్రత్యేక నిర్మాణాలను ఇప్పటి వరకూ గుర్తించలేదని అన్నారు.

విన్న శబ్దాలను అనుకరించడానికి సాయపడే ప్రత్యేకమైన కర్పరాలు కూడా చిలుకల్లో ఉన్నట్టు గుర్తించారు. హమ్మింగ్ బర్డ్ వంటి కొన్ని రకాల జాతుల పక్షుల్లోనూ ఇలాంటి కర్పరాలు ఉన్నా.. వాటి పరిమాణం చిలుకల్లో పెద్దగా ఉన్నట్టు నిర్ధారించారు. అందువల్లనే మానవులు చెప్పే మాటలను ముద్దు ముద్దుగా పలకడం వీటికి మాత్రమే సాధ్యమైందని వివరించారు. అయితే వీటి మెదడులో ఇలాంటి ప్రత్యేక నిర్మాణాలు వీటి జాతి ఆవిర్భవించినప్పటి నుంచీ ఉన్నాయా.. లేక కాలక్రమేణా ఉద్భవించాయా.. అనే కోణంలో కూడా శాస్త్రవేత్తలు పరిశోధించారు. వీటికి  ఈ ప్రత్యేకతలు కొన్ని కోట్ల సంవత్సరాల ముందు నుంచే ఉన్నాయని ధ్రువీకరించారు.

Videos

కూటమితో లాభం లేదు..

సీఎం జగన్ ఈరోజు షెడ్యూల్

బీసీ నేత ఆర్ కృష్ణయ్యపై పచ్చ రౌడీలు దాడి..

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు