amp pages | Sakshi

మోడల్‌పై రేప్‌ అటెంప్ట్‌.. ఊహించని మలుపు

Published on Thu, 03/22/2018 - 19:17

దుబాయ్‌ : ఆమె ఓ పేరుగాంచిన మోడల్‌. ఓ కాంట్రాక్ట్‌ పని నిమిత్తం దుబాయ్‌ వెళ్లి ఓ హోటల్‌లో బస చేసింది. అయితే అదే హోటల్‌లో దిగిన ఓ వ్యాపారవేత్త ఆమెపై అఘాయిత్యం చేయబోయాడు. అతన్ని నుంచి తప్పించుకునేందుకు ఆరో అంతస్థు నుంచి దూకేసింది. వెన్నెముకకు గాయం కాగా ప్రాణాలతో ఆమె బయటపడింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేయటం ఇక్కడ విశేషం.

భాదితురాలి కథనం ప్రకారం...  సైబీరియాకు చెందిన 22 ఏళ్ల ఎక్టెరీనా.. ఓ కాస్మోటిక్‌ సంస్థతో కాంట్రాక్ట్‌ పని కోసం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ ఓ పాకిస్థానీ వ్యాపారవేత్త(39) ఒప్పందం కోసం హోటల్‌ గదికి ఆమెను ఆహ్వానించాడు. ఆమె వెళ్లే సరికి అతను ఫుల్‌గా తాగేసి ఉన్నాడు. ఆ మత్తులో ఆమెపై అత్యాచారయత్నం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించటంతో ఓ కత్తితో ఆమెను బెదిరించి బట్టలిప్పాలని బెదిరించాడు. 

ప్రాణ భయంతో అతను చెప్పినట్లుగా ఆమె చేసింది. ఆపై అతని నుంచే తప్పించుకునేందుకు నగ్నంగానే హోటల్‌ బిల్డింగ్‌ నుంచి దూకేసింది. ఘటన తర్వాత పారిపోయేందుకు యత్నించిన వ్యాపారవేత్తను ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్టెరీనా వెన్నెముకకు తీవ్ర గాయాలు కావటంతో వైద్యులు రెండు సర్జరీలను చేశారు.

బాధితురాలి అరెస్ట్‌... 
అయితే ఆమె తనను కత్తితో చంపే యత్నం చేసిందని నిందితుడు ఫిర్యాదు చేశాడు. బాధితురాలు చెబుతున్నట్లు అత్యాచారం ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. పైగా అతని ఒంటిపై కత్తి గాయాలు ఉన్నాయి. దీంతో మోడల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను అరెస్ట్‌ చేశారు. ఆస్పత్రి నుంచి నేరుగా ఆమెను జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఆమె మోడలింగ్‌తోపాటు వ్యభిచారం కూడా నిర్వహిస్తోందని.. అందుకే దుబాయ్‌ వచ్చిందని సదరు వ్యాపారవేత్త ఆరోపిస్తున్నాడు. మరోవైపు  ఎక్టెరీనా తల్లి మాత్రం వాటిని ఖండిస్తోంది. దుబాయ్‌లోని రష్యన్‌ కాన్సులేట్‌ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టింది.

Videos

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?