amp pages | Sakshi

సౌదీ మహిళకు స్టీరింగ్‌

Published on Mon, 06/25/2018 - 02:33

రియాద్‌: సౌదీ అరేబియాలో మహిళలు ఆదివారం వాహనాలతో రోడ్లెక్కారు. కార్లతో రోడ్లపై సందడి చేస్తూ, కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. సౌదీలో దశాబ్దాలుగా మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఆ దేశ యువరాజు బిన్‌ సల్మాన్‌ ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులు 2018, జూన్‌ 24 నుంచి అమల్లోకి వస్తాయని అప్పట్లో పేర్కొన్నారు. మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడంతో ఆదివారం తెల్లవారుజామున మహిళలు కార్లతో రోడ్లపైకి చేరి సంబరాలు చేసుకున్నారు.

తొలిసారి డ్రైవింగ్‌కు బయలుదేరినవారికి కొందరు మహిళలు పూలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది మహిళలు తమ తొలి కారు డ్రైవింగ్‌ మధుర క్షణాలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తాము కుటుంబ సభ్యులను కారులో కాఫీ షాప్‌కు, ఐస్‌క్రీమ్‌కు తీసుకెళ్తామని వెల్లడించారు. తండ్రి, సోదరులు, ప్రైవేటు పురుష డ్రైవర్ల అవసరం లేకుండా తొలిసారి కారును నడపడంపై మహిళా యాంకర్, రచయిత సమర్‌ అల్మోగ్రెన్‌ స్పందిస్తూ.. ‘నాకు పక్షి అంత స్వేచ్ఛ లభించినట్లు అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. 

సౌదీ యువరాజు, కోటీశ్వరుడు అల్‌వలీద్‌ బిన్‌ తలాల్‌ ‘మహిళలకు ఇది గొప్ప విజయం. ఎట్టకేలకు మహిళలకు స్వేచ్ఛ లభించింది’ అని అన్నారు. తన కుమార్తె ఎస్‌యూవీ కారును డ్రైవింగ్‌ చేస్తుండగా, అదే కారులో ఆయన మనుమరాళ్లతో కలసి సంబరాలు చేసుకున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ విషయమై ఓ నిర్మాణ సంస్థ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ హలా మాట్లాడుతూ..‘డ్రైవింగ్‌ అనుమతి లేకపోవడంతో కంపెనీల్లో పనిచేసే మహిళలకు చాలా కష్టసాధ్యంగా ఉండేది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడు మహిళలందరూ స్వేచ్ఛగా వాహనాలు నడుపుకుంటూ విధులకు హాజరయ్యే వెసులుబాటు ఏర్పడింది. త్వరలోనే మేనేజర్‌ స్థాయి ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగనుంది’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

12 ఏళ్లలో రూ.6.1 లక్షల కోట్లు
మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేయడం ద్వారా సౌదీ అరేబియా ఆర్థికంగా పురోగమించనుందా? కొత్త ఉద్యోగాల సృష్టి జరగడంతో పాటు మహిళల జీవనప్రమాణాలు మెరుగు కానున్నాయా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. డ్రైవింగ్‌కు మహిళల్ని అనుమతించడంపై గల్ఫ్‌ టాలెంట్‌ అనే ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ అనుమతి తర్వాత డ్రైవింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 82 శాతం మంది మహిళలు తెలిపారు. తాజా నిర్ణయంతో ఇన్నాళ్లు పురుషులు ఆధిపత్యం చెలాయిస్తున్న ఉన్నతస్థాయి ఉద్యోగాలకు తాము దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడిందని పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. యువరాజు సల్మాన్‌ నిర్ణయంతో మరో 12 ఏళ్లలో సౌదీ ఆర్థిక వ్యవస్థకు రూ.6.1 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మహిళా సాధికారతే లక్ష్యం
మహిళలకు సాధికారత కల్పించడంలో భాగంగా 2030 నాటికి మొత్తం ఉద్యోగుల్లో 22 నుంచి 30 శాతం మహిళలు ఉండాలని సౌదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం చేపట్టిన సంస్కరణలో భాగంగా తొలుత మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని తొలగించింది. దీనిద్వారా వాళ్లు మంచి ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతం పొందేందుకు వీలవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తాజా నిర్ణయంతో మహిళలు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే వెలుసుబాటు లభించింది. మహిళల డ్రైవింగ్‌పై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో మరింత మంది మహిళా ఉద్యోగుల్ని తీసుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఆకర్షణీయమైన వేతనాలకు అందుకోనున్నారు. కార్ల మార్కెట్‌ కూడా గణనీయంగా అభివృద్ధి చెందనుంది. 2020కి 30 లక్షల మహిళలు డ్రైవింగ్‌ చేస్తారని అంచనా.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)