amp pages | Sakshi

శిల్పం.. సూక్ష్మం

Published on Tue, 11/18/2014 - 01:07

లండన్‌ : ఈ బుల్లి శిల్పాన్ని చిన్న చీమ తల మీద నిల్చోబెట్టవచ్చు. వెంట్రుక మీద బ్యాలెన్సింగ్ చేయించవచ్చు. ఫొటో చూడండి. సూది బెజ్జంతో దీన్ని పోల్చినా.. ఎంత చిన్నదిగా ఉందో చూశారుగా.. వీటి సృష్టికర్త లండన్‌కు చెందిన నానో శిల్పకారుడు జాంటీ హర్విట్జ్. ఇలాంటివి మొత్తం ఏడింటిని రూపొందించారు. వీటిలో అతి పెద్దది మన వెంట్రుక మందముంటే.. మిగతావి అందులో సగం కన్నా చిన్నవేనట! 10 నెలల కృషి అనంతరం జాంటీ వీటిని తయారుచేశారు. వీటిని చూడటానికి కేన్సర్ కణాలను పరిశీలించడానికి వాడే అత్యాధునిక మైక్రోస్కోప్‌ను ఉపయోగించారు.
 
తయారీ ఇలా..: ముందుగా ఓ మోడల్‌ను ఫొటోలు తీశారు. ఆమెకు అన్ని వైపులా మొత్తం 250 కెమెరాలు పెట్టి.. అణువణువు క్లిక్‌మనిపించారు. తర్వాత వాటిని అత్యధిక సామర్థ్యమున్న కంప్యూటర్‌లో ఫీడ్ చేసి.. డిజిటల్ బొమ్మను రూపొందించారు. అనంతరం  త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి.. ఈ అద్భుత నానో శిల్పాలను రూపొందించారు. ఇంతకీ వెంట్రుక ఎంత మందముంటుందో తెలుసా? 40 నుంచి 50 మైక్రాన్లు. మైక్రాన్ అంటే మిల్లీ మీటర్‌లో వెయ్యో వంతు. దాని లెక్కన అంచనా వేసుకోండి. ఇవి ఎంత చిన్నగా ఉన్నాయో..  
 
యాంటీ క్లైమాక్స్..

జాంటీ గొప్పతనమంతా విన్నాం. అయితే.. ఆ శిల్పాలను మనం చూడాలంటే.. ప్రస్తుతం ఇలాంటి ఫొటోలే గతి. ఎందుకంటే.. వీటిని తయారుచేసిన కొన్ని గంటలకు జాంటీ సహచరుడొకడు.. వీటిని వేరే యాంగిల్‌లో చూడాలనే ఉత్సాహంతో మైక్రోస్కోప్ కింద ఉన్న అద్దాన్ని కదిలించాడు. అవి కింద పడ్డాయి. ఏంటీ.. మైక్రోస్కోప్‌లో కనిపించడం లేదంటూ ఆందోళన చెందాడు. ఈ తడబాటులో అతడి చిటికెన వేలు అద్దం పక్కన యథాలాపంగా ల్యాండ్ అయింది. అంతే.. సర్వనాశనం.. 7 నానో శిల్పాలు చరిత్రలో కలిసిపోయాయి.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)