amp pages | Sakshi

ఆరు అడుగుల దూరం స‌రిపోదు

Published on Fri, 05/29/2020 - 16:24

కాలిఫోర్నియా: 'చికిత్స క‌న్నా నివార‌ణ మేలు' అనే మాట‌ క‌రోనాకు స‌రిగ్గా స‌రిపోతుంది. మందు లేని ఈ మాయ‌దారి రోగానికి మ‌నం పాటించే జాగ్ర‌త్త‌లే ర‌క్ష‌గా నిలుస్తాయి. అత్య‌వ‌స‌రం కానిదే బ‌య‌ట‌కు వెళ్ల‌క‌పోవ‌డం, ముఖ్యంగా మాస్కు ధ‌రించ‌డం, మరీ ముఖ్యంగా ఆర‌డ‌గుల భౌతిక దూరం పాటించ‌డం. అన్నీ స‌రే కానీ.. ఆర‌డుగుల దూరం క‌రోనాను నిలువ‌రించ‌లేదని బాంబు పేల్చారు సైంటిస్టులు. కొన్నిసార్లు క‌రోనా వైర‌స్‌ క‌ణాలు సుమారు 20 అడుగుల దూరం వ‌ర‌కు ప్ర‌యాణించ‌వచ్చ‌ని హెచ్చ‌రిస్తున్నారు. సాంత బ‌ర్బ‌రాలోని కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు దీనిపై అధ్య‌య‌నం చేసి మ‌రీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. (లిఫ్టుల్లో ఎదురెదురుగా నిలబడొద్దు)

వైర‌స్ వ్యాప్తిని నిర్దేశించే వాతావ‌ర‌ణం!
ఈ అధ్య‌య‌నం ప్ర‌కారం.. తుమ్మిన‌ప్పుడు, ద‌గ్గిన‌ప్పుడు, కొన్నిసార్లు మ‌నిషి సాధార‌ణంగా మాట్లాడే స‌మ‌యంలోనూ నోటి నుంచి దాదాపు 40 వేల బిందువులు సెకనుకు వంద మీట‌ర్ల మేర‌ వ్యాప్తి చెందుతాయి. ఈ బిందువుల‌ను అధ్య‌య‌న‌కారులు రెండు ర‌కాలుగా విభ‌జించారు. పెద్ద ప‌రిమాణంలో ఉండే స్థూల క‌ణాలు త‌క్కువ దూరం ప్ర‌యాణించి అక్క‌డే స్థిర‌ప‌డుతాయి. కానీ సూక్ష్మ క‌ణాలు వైర‌స్‌ను ఎక్కువ దూరం మోసుకెళ్లే సామ‌ర్థ్యం ఉండ‌టంతో పాటు కొన్ని గంట‌ల పాటు గాలిలోనే ఉండ‌గ‌ల‌వ‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు. వాతావ‌ర‌ణంలోని మార్పులు వైర‌స్ వ్యాప్తిని మ‌రింత ప్ర‌భావితం చేసే అవ‌కాశ‌ముంద‌ని పేర్కొన్నారు. అమెరికాలోని సీడీసీ(సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్‌) సూచించిన‌ ఆరు అడుగుల భౌతిక దూరం అన్ని వేళ‌లా ప‌నిచేయ‌కపోవ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వైర‌స్ క‌ణాలు ఆరు అడుగులే కాకుండా ఆరు మీట‌ర్ల(19.7 అడుగులు) వ‌ర‌కు వ్యాపిస్తాయ‌ని తెలిపారు. (ఎందుకు.. ఏమిటి.. ఎలా? )

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)