amp pages | Sakshi

చిన్న రోబో.. పెద్ద సాయం!

Published on Fri, 10/26/2018 - 04:19

బోస్టన్‌: సీరియస్‌గా చదువుతుండగా ఎవరో డోర్‌బెల్‌ కొట్టారు.. వెంటనే లేచి డోర్‌ తీయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైన వెళ్లి తీస్తే బాగుండనిపిస్తుంది కదూ! అందుకే మీలాంటి వారి కోసమే ఓ రోబోను తయారు చేశామంటున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా వారు అభివృద్ధి చేసిన ఎగిరే రోబో.. రిమోట్‌తో ఆదేశిస్తే చాలు సహాయకుడిలా అన్ని చేసేస్తుందంటున్నారు. డోర్‌ లాక్‌ తీసి తలుపును తెరుస్తుంది. అంతేకాదు, దాహం వేస్తే ఫ్రిడ్జ్‌లో వాటర్‌ బాటిల్‌ను సైతం తీసుకొచ్చి చేతికందిస్తుంది. ఆహారం తేవడం, కెమెరాతో వీడియో తీయడం వంటి ఎన్నో చిన్న చిన్న పనులు చేసేలా ఈ రోబోలను అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు.

ఫ్లైక్రో టగ్స్‌గా పిలిచే వీటిని తొలుత తొండలు, కీటకాల నుంచి ప్రేరణ పొంది తయారు చేశారు. గోడలపై పాకుతూ బూజు తొలగించడం, ఫ్లోర్‌పై చెత్తను తీసేయడం లాంటివి చేసేవి. తాజాగా పక్షిలా ఎగిరేలా వీటికి రెక్కలు జోడించడంతో పాటు, వాటి బరువు కంటే 40 రెట్లు ఎక్కువ బరువును మోసేలా సాంకేతికత సాయంతో సామర్థ్యాన్నీ పెంచారు. ఉపరితలానికి తగ్గట్టుగా ల్యాండ్‌ అయ్యేందుకు వీటికి 32 మైక్రోస్పైన్స్‌ కూడా అమర్చారు. ఇవి ఎక్కువ బరువును మోయడమే కాకుండా చాలా వేగంగా పని చేస్తాయని శాస్త్రవేత్త మార్క్‌ కట్కోస్కై తెలిపారు. భవిష్యత్తులో ఈ రోబోల్లో స్వీయనియంత్రణ వ్యవస్థను ప్రవేశపెట్టేలా పరిశోధనలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Videos

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం

చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు

చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్

పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు

KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

Photos

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)