amp pages | Sakshi

ముగ్గురు భారతీయ అమెరికన్ల తొలి విజయం

Published on Wed, 09/05/2018 - 22:25

వాషింగ్టన్‌: అమెరికా ప్రతినిధుల సభకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భారత సంతతికి చెందిన అమెరికన్లు ముగ్గురు తొలి విజయం సాధించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆగస్టు 31న ఆరిజోనా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో హిరాల్‌ తిపిర్నేని, అనితా మాలిక్, సంజయ్‌ పటేల్‌లు ఏకగ్రీవంగా గెలిచారు. వీరిలో తిపిర్నేని, మాలిక్‌లు ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున ఆరిజోనా నుంచి పటేల్‌ ఫ్లోరిడా నుంచి  పోటీ చేశారు. 

ఆరిజోనా రాష్ట్రంలోని 8వ కాంగ్రెస్‌ స్థానం నుంచి తిపిర్నేని ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మాలిక్‌ 6వ కాంగ్రెస్‌ స్థానంలో ముగ్గురితో పోటీ పడి నెగ్గారు. పటేల్‌ ఫ్లోరిడాలోని 8వ కాంగ్రెస్‌ స్థానంలో ఏకగ్రీవంగా విజయం సాధించారు. నవంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికల్లో మాలిక్‌ రిపబ్లికన్‌ అభ్యర్థి డేవిడ్‌ సావికెర్ట్‌తో తలపడాల్సి ఉంటుంది. ఈ ఏడాది మొదట్లో జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో తిపిర్నేని రిపబ్లికన్‌ అభ్యర్థి డెబీ లెస్కో చేతిలో ఓడిపోయారు. వచ్చే నవంబర్‌ ఎన్నికల్లో మళ్లీ వీరిద్దరే పోటీ పడతారు. పటేల్‌ రిపబ్లికన్‌ ఎంపీ బిల్‌ పోసేతో తలపడనున్నారు. మాలిక్‌ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నట్టు ఇండియన్‌–అమెరికన్‌ ఇంపాక్ట్‌ ఫండ్‌ మంగళవారం ప్రకటించింది.

అమెరికా ప్రతినిధుల సభలో ప్రస్తుతం నలుగురు భారతీయ అమెరికన్లు ఉన్నారు. అమెరికా కాంగ్రెస్‌ చరిత్రలో ఇంత మంది భారతీయులు ఎంపీలుగా ఉండటం ఇదే మొదటి సారి. వీరిలో అమిబెరా(కాలిఫోర్నియా) మూడో సారి కాంగ్రెస్‌కు ఎన్నిక కాగా, రాజా కృష్ణమూర్తి(ఇల్లినాయిస్‌), ప్రమీల జయపాల్‌(వాషింగ్టన్‌), రో ఖన్నా(కాలిఫోర్నియా)లు మొదటి సారి సభకు ఎంపికయ్యారు. ఈ నలుగురూ డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన వారే. ఈ నలుగురు కూడా ప్రైమరీ ఎన్నికల్లో గెలిచి నవంబర్‌ ఎన్నికలకు సిద్ధపడుతున్నారు. వీరు కాకుండా మరో నలుగురు భారతీయ అమెరికన్లు కూడా ఇంతకు ముందే ప్రైమరీ ఎన్నికల్లో గెలిచారు. వారిలో జితేందర్‌ దిగంకర్, హారీ ఆరోరా, అఫ్తాబ్‌ పురేవాల్‌లు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. నాలుగో వ్యక్తి అమెరికా మాజీ దౌత్యవేత్త ప్రిస్టన్‌ కులకర్ణి.ఈ ఏడాది ప్రారంభం నుంచి జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో దాదాపు 20 మంది భారతీయ అమెరికన్లు పోటీ చేస్తున్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)