amp pages | Sakshi

ట్రంప్‌ ట్వీట్లకు ఓ ప్రదర్శన!

Published on Mon, 06/19/2017 - 02:50

తెల్లవారు జాము ట్వీట్లతో ప్రపంచాన్ని అదరగొట్టే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచారకాలం నుంచే ట్విట్టర్‌ను వాడుకున్నంతగా మరే రాజకీయవేత్త వాడుకోలేదన్నది వాస్తవం. ఫెడరల్‌ సర్కారులో కీలక పదవుల్లో ఉన్నవారిని తొలగించే విషయాన్ని, కొత్త వారిని నియమించే సమాచారాన్ని ట్విట్టర్‌ ద్వారానే ప్రకటించడం, కోపమొచ్చినా, సంతోషమొచ్చినా ట్వీట్లు కొట్టి కింగ్‌ ఆఫ్‌ ట్వీట్స్‌గా బిరుదు సంపాదించుకున్నారు ఆయన. ఇప్పుడు ఆయన ట్వీట్లన్నింటినీ ఒక చోట చూసే భాగ్యం న్యూయార్క్‌వాసులకు దక్కింది. న్యూయార్క్‌లో టెలివిజన్‌ కామెడియన్‌ ట్రెవర్‌ నోవాద డొనాల్డ్‌ జె ట్రంప్‌ ప్రెసిడెన్షియల్‌ ట్విట్టర్‌ లైబ్రరీ పేరుతో ప్రదర్శన ప్రారంభించారు. ట్రంప్‌ వల్ల కామెడీ సెంట్రల్‌ నెట్‌వర్క్ ‘ద డైలీ షో’కు జనాదరణ విపరీతంగా పెరగడంతో ట్రెవర్‌ ఇప్పుడు ట్రంప్‌ టవర్‌కు సమీపంలోనే ఇంత సాహసం చేశారు. ట్వీట్లు చదవి భావావేశంతో ఉప్పొంగినవారు ఈ ఎగ్జిబిషన్‌ ప్రవేశం వద్దే ఏర్పాటుచేసిన గోల్డెన్‌ టాయ్‌లెట్‌పై కూర్చుని ట్వీట్‌ చేసే ఏర్పాటు చేశారు.
 
ప్రదర్శన భవనంలోకి అడుగుపెట్టగానే మొదట కనపడేది గాజు తలుపులు, మెటల్‌డిటెక్టర్లున్న సెక్యూరిటీ గార్డులు. తర్వాత ఓ గాజు కేసింగ్‌లో రెండు చేతులు పట్టుకున్న ఐఫోన్‌ దర్శనమిస్తుంది. ఈ చేతుల వెనుక ఉన్న భారీ తెరపై ట్రంప్‌ ట్వీట్ల ప్రదర్శన గురించి ట్రెవర్‌ వీడియో నడుస్తూంటుంది. ఎగ్జిబిషన్‌ గోడలపై గతంలో ట్రంప్‌ చేసిన ముఖ్య ట్వీట్లను బంధించిన ఫ్రేములు  ఏర్పాటుచేశారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీని తొలగించే విషయం చెబుతూ మే 10న ఉదయం 7:19కి చేసిన ట్వీట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. అంతేగాక, ఏఏ అమెరికా బడా నేతలపై ఎన్నిసార్లు విరుచుకుపడినదీ ఈ ప్రదర్శనలో చూపించారు. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాపై 2723, ఓడిన డెమొక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై 884, రిపబ్లికన్‌ టికెట్‌ రేస్‌లో తన ప్రత్యర్థుల్లో ఒకరైన టెడ్‌ క్రూజ్‌పై 323, మరో అభ్యర్థి జెబ్‌ బుష్‌పై 295 సార్లు విమర్శల బాణాలతో ట్వీట్‌ చేశారని తెలిపారు.

కోవ్‌ఫెఫె-టైపింగ్‌ తప్పుతో పుట్టిన వింత పదం!
ట్రంప్‌ ట్విట్టర్‌ వ్యసనం వల్లే టైపింగ్‌లో వచ్చిన తప్పుతో పుట్టిన కోవ్‌ఫెఫె అనే పదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందింది. ఈ ఎగ్జిబిషన్‌లో గతంలో ట్రంప్‌ చేసిన కొన్ని కీలకమైన ట్వీట్లను ఫోటో ఫ్రేముల్లో అందమైన డిజైన్లతో అలంకరించి మరీ గోడలకు వేలాడదీశారు.  ‘ట్రంప్‌ ఫైన్‌’ ట్విట్టర్. ఆయనలా ఏ అధ్యక్షుడూ  ఏకకాలంలో ఇంత పారదర్శకంగా, అంతే స్థాయిలో గుట్టువిప్పకుండా వ్యవహరించలేదు’’ అని టెవర్‌ అన్నారు.
                                                                                                             -(సాక్షి నాలెడ్జ్ సెంటర్‌)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)