amp pages | Sakshi

హెచ్‌1బీ మరింత కఠినం

Published on Sat, 02/24/2018 - 01:27

వాషింగ్టన్‌: భారతీయ ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై పెను ప్రతికూల ప్రభావం చూపేలా హెచ్‌1–బీ వీసాల జారీలో అమెరికా భారీ మార్పులు చేసింది. విదేశీ కంపెనీల తరఫున అమెరికాలోని ‘థర్డ్‌ పార్టీ వర్క్‌ సైట్ల’లో పనిచేసేవారికి హెచ్‌–1బీ వీసాల జారీని కఠినంచేస్తూ కొత్త పాలసీ తెచ్చింది.

ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త పాలసీ ప్రకారం థర్డ్‌ పార్టీ వర్క్‌సైట్‌లో హెచ్‌–1బీ వీసా కోరుతున్న ఉద్యోగి పనిచేయాల్సిన అవసరాన్ని, వారి నైపుణ్యాల్ని కంపెనీలు నిరూపించాలి. హెచ్‌–1బీ వీసాదారు వర్క్‌ కాంట్రాక్ట్‌ ఎంతకాలముంటే అంత కాలానికే వీసాలు జారీ చేస్తామని, ఒకవేళ వీసాల్ని పొడిగించుకోవాలనుకుంటే తాజా నిబంధనల్ని పాటించాల్సిందేనని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ విభాగం తెలిపింది. ఉద్యోగి తరఫున వీసా దరఖాస్తు సమయంలోనే ఆ వివరాల్ని సమర్పించాలని సూచించింది.   భారతీయ కంపెనీల తరఫున హెచ్‌–1బీ వీసాదారులు పనిచేసే కంపెనీలను ‘థర్డ్‌ పార్టీ వర్క్‌సైట్లు’ అంటారు.  

పని ఉన్నంత కాలానికే..
అమెరికన్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) గురువారం జారీ చేసిన ఏడు పేజీల తాజా పాలసీ ప్రకారం థర్డ్‌ పార్టీ వర్క్‌సైట్‌లో ఎంత కాలం పనుంటే అంత కాలానికే హెచ్‌–1బీ వీసాలు జారీ చేస్తారు.   ఇప్పటిదాకా మూడేళ్ల కాలానికి హెచ్‌–1బీ వీసాల్ని జారీచేస్తుండగా... ఇక నుంచి అంతకంటే తక్కువ కాలానికే జారీ చేయనున్నారు. 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌–1బీ వీసా దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభం కానుందన్న వార్తల నేపథ్యంలో ఈ పాలసీని కొత్తగా అమెరికా తెరపైకి తెచ్చింది.

యజమాని–ఉద్యోగి బంధం కొనసాగించాలి
ఈ పాలసీ ప్రకారం ‘థర్డ్‌ పార్టీ వర్క్‌సైట్‌లో ఉద్యోగి పనిచేస్తున్నంతకాలం చట్టబద్ధమైన యజమాని–ఉద్యోగి సంబంధం కొనసాగేలా కంపెనీ చూసుకోవాలి. అలాగే ఉద్యోగి ప్రత్యేక నైపుణ్యమున్న వృత్తిలోనే పనిచేస్తాడని నిరూపించాల్సి ఉంటుంది. ఉద్యోగి చేయాల్సిన ప్రత్యేకమైన పని.. ఎంత కాలం పనిచేస్తాడు.. అందుకు సరిపడా నైపుణ్యం ఉందా? మొదలైన వివరాల్ని వీసా దరఖాస్తు సమయంలోనే కంపెనీలు వెల్లడించాలి. హెచ్‌–1బీ వీసాను గరిష్టంగా మూడేళ్ల వరకూ జారీచేయవచ్చని, అయితే ఆ నిర్ణయం తన విచక్షాణాధికారంపైనే ఆధారపడి ఉంటుందని, అయితే దరఖాస్తు సమయంలో కంపెనీ పేర్కొన్న కాలానికే వీసా జారీ చేస్తామని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. అయితే వీసా కోసం దరఖాస్తు చేసిన కంపెనీ.. యజమాని–ఉద్యోగి సంబంధాన్ని తప్పకుండా కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.  

వీసా పొడిగింపునకు తాజా నిబంధనలే  హెచ్‌–1బీ వీసా పొడిగింపునకు దరఖాస్తు చేస్తే తాజా నిబంధనల మేరకు అన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. ‘తాము సూచించిన నిబంధనల్ని పాటించకపోయినా.. నియమాలకు అనుగుణంగా వీసా పిటిషన్‌ లేకపోయినా తగిన చర్యలు తీసుకునేందుకు అధికారం ఉంటుంది’ అని స్పష్టం చేసింది. కొన్నిసార్లు అమెరికన్‌ కంపెనీలు ఉద్యోగితో కాంట్రాక్టును అర్థాంతరంగా రద్దు చేసుకుంటాయి. ఆ సమయంలో ఉద్యోగులకు తాత్కాలికంగా ఎలాంటి పని ఉండదు. బెంచ్‌ పిరియడ్‌గా పేర్కొనే ఆ సమయంలో కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు చెల్లించవు. అయితే అలా చేయడం చట్ట విరుద్ధమని, వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనని యూఎస్‌సీఐఎస్‌ స్పష్టం చేసింది.

భారతీయ కంపెనీలకు ఇబ్బందే..
తాజా నిబంధనల నేపథ్యంలో హెచ్‌–1బీ ఉద్యోగుల్ని అమెరికాకు పంపే కంపెనీలు వీసా దరఖాస్తులు సమర్పించేందుకు మరింత ఎక్కువ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. వీసా దరఖాస్తు లేఖతో పాటు.. ఉద్యోగికి కేటాయించే పని వివరాలు, ఆ పని చేసేందుకు అవసరమయ్యే నైపుణ్యం, విద్యార్హతలు, పని ఎంతకాలం ఉంటుంది, వేతనం, పనిగంటలు, ఇతర ప్రయోజనాల్ని జతపరచాలి.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)