amp pages | Sakshi

అలా అయితే గ్రీన్‌కార్డ్‌ రాదు!

Published on Tue, 08/13/2019 - 04:38

వాషింగ్టన్‌: అమెరికా గ్రీన్‌కార్డ్‌ పొందేందుకు ఎదురుచూస్తున్న ఆశావహులకు ఆ దేశ ప్రభుత్వం చేదువార్త చెప్పింది. ఫుడ్‌ స్టాంప్స్‌(అల్పాదాయ వ్యక్తులకు ఆహారం అందించేందుకు ప్రభుత్వం చవకగా ఇచ్చే వోచర్లు), వైద్య సాయం(మెడిక్‌ఎయిడ్‌), గృహ సదుపాయం(హౌజింగ్‌ అసిస్టెన్స్‌) తదితర సౌకర్యాలు కోరుకుంటున్న వారికి గ్రీన్‌ కార్డ్‌ నిరాకరించే అవకాశముందని స్పష్టం చేసింది. గ్రీన్‌కార్డ్‌ పొందినవారికి అమెరికాలో శాశ్వతంగా నివసించే అవకాశంతో పాటు పలు ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.

అమెరికా తమ పౌరులకు ఇచ్చే ఇలాంటి ప్రభుత్వ సౌకర్యాలను తాము భవిష్యత్తులో కూడా ఆశించబోమని కాన్సులార్‌ ఆఫీసర్‌ను నమ్మించాల్సి ఉంటుందని పేర్కొంటూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ తాజాగా నిబంధనలను జారీ చేసింది. అమెరికాకు రావాలనుకునే లేదా అమెరికాలో ఉండాలనుకునే విదేశీయులు తమ ఖర్చులను తామే భరించేలా, అమెరికా ప్రభుత్వం అందించే సౌకర్యాలపై ఆధారపడకుండా ఉండేలా ఈ తాజా నిబంధనలు తోడ్పడుతాయని వైట్‌ హౌజ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక స్థాయిని మించి ప్రభుత్వ సౌకర్యాలు పొందే వ్యక్తులను ‘పబ్లిక్‌ చార్జ్‌(ప్రజలపై భారం)’గా పరిగణిస్తారు.

అలా పబ్లిక్‌ చార్జ్‌గా మారే అవకాశమున్న వారిని దేశంలోకి అడుగుపెట్టకుండానే నిరోధిస్తారు. ఇప్పటికే దేశంలో ఉంటున్నవారైతే.. వారి ఇమిగ్రేషన్‌ స్థాయిని మార్చుకునే అవకాశం ఇవ్వరు. విదేశీయులపై ప్రజాధనం ఖర్చుకాకూడదనే ఈ నిబంధనలను అధ్యక్షుడు ట్రంప్‌ తెరపైకి తెచ్చారని వైట్‌హౌజ్‌ పేర్కొంది. ‘ఈ చట్టం 1996 నుంచే ఉంది కానీ కఠినంగా అమలు చేయలేదు’ అని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులపై భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌర, వలస సేవల సంస్థ(యూఎస్‌సీఐఎస్‌) డైరెక్టర్‌ కెన్‌ స్పష్టం చేశారు. ఈ నిబంధనల వల్ల గ్రీన్‌కార్డ్‌ ఆశావహులు తమ ఆదాయాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక వ్యాఖ్యానించింది.   

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)