amp pages | Sakshi

ఆగస్టులో అపరిమిత సెక్స్‌ ఫెస్టివల్‌

Published on Thu, 07/11/2019 - 08:32

న్యూయార్క్‌ : ‘కామి కాలేనివాడు మోక్షగామి కాలేడు’ అన్న భారతీయ వివాదాస్పద సాధువు రజనీష్‌ సూత్రాన్ని ఆచరించాలనుకున్నారేమోగానీ ‘వంద మంది అమ్మాయిలతో అపరిమిత సెక్స్‌ ’ అంటూ నిర్వహకులు ఇస్తున్న పిలుపు నేడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అమెరికాలోని నేవెడ రాష్ట్రంలో ‘సెక్స్‌ ఐలాండ్‌’ పేరిట ఆగస్టు రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోయే వేడుకలకు అప్పుడే టిక్కెట్ల అమ్మకం ప్రారంభమైంది. ఇప్పటికే 13 మంది బ్రిటీషర్లు సహా 30 మంది టక్కెట్లు బుక్‌ చేసుకున్నారు. ఒక్కో టిక్కెట్‌ ఆరువేల డాలర్లు. 

నాలుగు రోజులపాటు ఈ సెక్స్‌ వేడుకల్లో టెక్కెట్లు కొనుక్కొని వచ్చే పురుష పుంగవులు ప్రతి రోజు ఇద్దరు అందమైన అమ్మాయిలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. వీరు గుర్రాలపై, బైకులపై నగ్నంగా విహరించడమే కాకుండా, ఎలక్ట్రానిక్‌ లాంచీలపై కూడా తమ కామ క్రీడల్లో క్రీడించవచ్చు. హెలికాప్టర్‌ విహారం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. గతేడాది ఈ సెక్స్‌ వేడుకలను వెనిజులాలోని ఓ దీవిలో నిర్వహించారు. ‘డ్రగ్స్‌ అండ్‌ ఫ్రెండ్లీ వెకేషన్‌’గాను పిలిచే ఈ వేడుకల్లో నిషేధిత మాదక ద్రవ్యాలను కూడా యథేశ్చగా సరఫరా చేశారట. 



 విషయం తెలిసే కాబోలు, సెక్స్‌ వేడుకల రోజుల్లో దాడులు నిర్వహిస్తామని, డ్రగ్స్‌ చట్టాలను ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ‘అమెరికాస్‌ డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌’ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. డ్రగ్స్‌తోని విదేశీ పర్యాటకులు దొరికినట్లయితే వారిని అదుపులోకి తీసుకొని సమీపంలోని వలసదారుల కేంద్రానికి తరలించి వారిని వారి వారి దేశాలకు పంపిస్తామని కూడా హెచ్చరించారు. అంతేకాదు, సెక్స్‌కు సంబంధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించినా అసలు వేడుకలే జరగకుండా అడ్డుకుంటామని అమెరికా పోలీసులు కూడా నిర్వాహకులను హెచ్చరించారు. 18 ఏళ్ల ప్రాయంలోని వారిని సెక్స్‌కు అనుమతిస్తే కూడా కఠిన చర్యలు తప్పవని చెప్పారు. అమెరికాలో పరిమితంగా వ్యభిచారానికి అనుమతించిన ఏకైక రాష్ట్రం నేవడ. అందుకనే నిర్వాహకులు ఈ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్నారు. 



మొదటి సెక్స్‌ ఫెస్టివల్‌ గతేడాది కొలంబియాలోని కార్టెజెనా అనే ప్రైవేటు దీవిలో నిర్వహించాలనుకున్నారు. వేడుకలపై గొడవ మొదలవడంతో దక్షిణ అమెరికా ప్రభుత్వం వాటిని అడ్డుకుంది. దాంతో వ్యభిచారం చట్టబద్ధమైన వెనిజులాలోని ఇస్లా మార్గరిటలో జరిగింది. ఈ సారి కూడా ‘ఆర్గ్‌ హాలీడే’ అనే పొర్న్‌ వీడియో సంస్థతో కలసి ‘ది గుడ్‌ గర్ల్‌ కంపెనీ’ ఈ వేడుకలను నిర్వహిస్తోంది. అమెరికా పోలీసులు, డ్రగ్స్‌ విభాగం హెచ్చరికలకు భయపడరాదని ‘ది గుడ్‌ గర్ల్‌ కంపెనీ’ వారు తెలిపారు. స్థానిక చట్టాలకు అనుగుణంగా అన్ని వ్యవహారాలు నడుస్తాయని, తాము స్థానిక చట్టాలను ఉల్లంఘించడం లేదని వారు చెప్పారు. తమ అమ్మాయిలెవరికి సుఖ రోగాలు లేవని, అందరికి ముందుగానే వైద్య పరీక్షలు చేయించామని, తమ అమ్మాయిలు కండోమ్స్‌కు కట్టుబడి ఉంటారని తెలిపారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)