amp pages | Sakshi

ఐక్యరాజ్య సమితికి అమెరికా షాక్‌

Published on Wed, 12/27/2017 - 15:25

న్యూ యార్క్‌ : జెరుసలేం విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ దేశాలు ఒక్కటవ్వడాన్ని అగ్రరాజ్యం సహించలేకపోతోంది. జెరూసలేం నిర్ణయంపై వ్యతిరేకంగా ఓటేసిన దేశాలకు విడుదల చేసే నిధులపై కోత పెడతామంటూ హెచ్చరికలు జారీ చేసిన అమెరికా.. మొదటి షాక్‌ ఐక్యరాజ్య సమితికే ఇచ్చింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ కీలక ప్రకటన ఒకటి చేశారు.

ఐక్యరాజ్య సమితి కార్యకలాపాల కోసం 2018-19 మధ్యకాలంలో కేటాయించే నిధుల్లో 285 మిలియన్‌ డాలర్ల కోత పెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ప్రపంచదేశాలన్నీ అమెరికాను ఒంటరి చేశాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా షాక్‌తింది. ఐక్యరాజ్య సమితి సమర్థత, ఆర్థిక అంశాలపై మాకు స్పష్టమైన అవగాహన వుంది.. మేం చేయాలనుకున్నది చేస్తామని నిక్కీ హేలీ స్పష్టం చేశారు.

అమెరికన్ల ప్రేమ, ఔదార్యాన్ని మిగిలిన దేశాలు కూడా ఏంతోకాలం పొందలేవని ఆమె చెప్పారు. ఇదిలావుండగా.. సమితికి కేటాయించే మొత్తం బడ్జెట్‌ నిధులను నిలిపేస్తున్నారా? లేక సమితి నిర్వహణ కోసం అందించే ఉదార నిధులును అమెరికా రద్దు చేసిందా అన్న విషయంపై స్పష్టత రావాల్సివుంది. 

జెరూసలేం నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా అధికారికంగా గుర్తిస్తున్నామని, అమెరికన్ ఎంబసీని జెరూసలేంకు మార్చుతున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిరోజులు క్రితం ప్రకటించారు. ముస్లిం దేశాల్లో అల్లర్లు, ఆందోళనలు చెలరేగాయి. దీంతో అమెరికా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పప్రపంచదేశాలన్నీ సమితిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనికి 128 దేశాల మద్దతుల లభించింది. సర్వసభ్య సమావేశం తరువాత నిక్కీ హేలీ చాలా ఆగ్రహంగా మాట్లాడారు.  ‘‘అమెరికా చరిత్రలో ఇది మరచిపోలేని రోజు.. అమెరికాకు వ్యతిరేకంగా నిలిచిన అన్నీ దేశాలను గుర్తుపెట్టుకుంటాం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన అనంతరం నిధుల కోతపై నిక్కీ హేలీ రోజుల వ్యవధిలోనే ప్రకటించడం గమనార్హం. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)