amp pages | Sakshi

ఇద్దరిలో ఎవరు గొప్ప.. మీరే చెప్పండి

Published on Sat, 06/06/2020 - 11:27

న్యూయార్క్‌ : ఒకరు చూస్తే రెండుసార్లు ఒలింపిక్స్‌లో పోటీ పడిన అథ్లెట్‌, మరొకరేమో మోడల్‌ కమ్‌ అథ్లెట్‌.. వీరిద్దరు చేసిన వర్కవుట్‌ చాలెంజ్‌లో ఎవరు విజేతగా నిలిచారనేది మాత్రం వీడియోలో చూసి తెలుసుకోవాల్సిందే. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. మిడిల్‌ ట్రాక్‌ డిస్టెన్స్‌లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్న అమెరికన్‌ అథ్లెట్‌ నిక్‌ సిమ్మండ్స్‌ సొంతంగా ఒక యూట్యూబ్‌ చానెల్‌ను నిర్వహిస్తున్నాడు. ఆటకు రిటైర్మంట్‌ ప్రకటించిన తర్వాత యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా ఫిటనెస్‌పై సూచనలు, సలహాలు అందిస్తున్నాడు.

తాజాగా తన లాగా వర్కవుట్‌ చేయాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌ మోడల్‌ కమ్‌ అథ్లెట్‌ క్లారీ పి థామస్‌ను ఆహ్వానించాడు. నిక్ అడిగిన వెంటనే క్లారీ థామస్‌ వర్కవుట్‌ చాలెంజ్‌కు ఒప్పుకుంది. కాగా క్లారీ థామస్‌కు ఇన్‌స్టాలో దాదాపు 7.7 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. సహజంగానే మంచి అథ్లెట్‌ అయిన ఆమె వర్కవుట్స్‌లో నిక్‌ను మించి ప్రదర్శన నమోదు చేసింది. ' నేను సహజంగానే అథ్లెట్‌ను.. మోడల్‌గా కంటే అథ్లెట్‌గా ఉండడానికే ఎక్కవగా ఇష్టపడుతా' అంటూ పేర్కొంది.

పుల్‌ అప్స్‌ నుంచి మొదలుకొని రోఫ్‌ క్లైంబింగ్‌ వరకు క్లారీ నిక్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే ఇద్దరిలో ఎవరు గెలిచారనేది మాత్రం వీడియో చూసి తెలుసుకోవాల్సిందే. నిక్‌ ఈ వీడియోనూ తన యూట్యూబ్‌ చానెల్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 2లక్షలకు పైగా వీక్షించారు. ఇద్దరు పోటాపోటీగా వర్కవుట్స్‌ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. 'ఇది చూడడానికి ఫన్‌గా అనిపిస్తున్నా.. మీరు మాకు ఆదర్శంగా నిలిచారు' అంటూ కామెంట్లు పెడతున్నారు.
(జార్జియాలో కూలిన విమానం; ఐదుగురు మృతి)
(ఆయన నాపై అత్యాచారం చేశారు)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌