amp pages | Sakshi

అమెరికాకు ‘ఆధార్‌’ సమాచారం!

Published on Sun, 08/27/2017 - 02:56

- ట్వీటర్‌లో వికీలీక్స్‌ సంచలన వ్యాఖ్యలు
దుర్వినియోగమయ్యే అవకాశం లేదు: భారత్‌
 
వాషింగ్టన్‌: భారతీయుల ఆధార్‌ సమాచారం అమెరికాకు అందుబాటులో ఉందంటూ వికీలీక్స్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ)కి చెందిన గూఢచారులకు ఆధార్‌ డేటాబేస్‌ అందుబాటులో ఉందని ట్వీటర్‌లో ఆరోపించింది. ఆధార్‌ డేటాబేస్‌ను అందుబాటులోకి తెచ్చుకునేందుకు సీఐఏ.. అమెరికాకు చెందిన క్రాస్‌ మ్యాచ్‌ టెక్నాలజీస్‌ కంపెనీని వాడుకుంటున్నట్లు పేర్కొంది. గోప్యత ప్రాథమిక హక్కేనని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో వికీలీక్స్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని భారత్‌ ఖండించింది.

‘ఆధార్‌ డేటా చాలా సురక్షితంగా నిక్షిప్తమై ఉంది. వేరే ఏ ఏజెన్సీ కానీ, సంస్థ కానీ ఆ వివరాలను పొందే అవకాశమే లేదు’అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆధార్‌ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) ధ్రువీకరించిన బయోమెట్రిక్‌ పరికరాలను సరఫరా చేసే కంపెనీల్లో క్రాస్‌ మ్యాచ్‌ టెక్నాలజీస్‌ ముందువరుసలో ఉంది. వేలిముద్రలు, ఐరిస్‌ రికార్డు చేసే పరికరాలను సరఫరా చేసేందుకు 2011లో ఈ కంపెనీ అనుమతులు పొందింది.

రహస్యంగా డేటాను సేకరించేందుకు ‘ఎక్స్‌ప్రెస్‌ లేన్‌’అనే వ్యవస్థను సీఐఏ ఉపయోగించుకుంటోందని ‘గ్రేట్‌ గేమ్‌ ఇండియా’వెబ్‌సైట్‌ ఓ కథనంలో పేర్కొంది. సీఐఏకు చెందిన ఆఫీస్‌ ఆఫ్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ వద్ద బయోమెట్రిక్‌ వివరాలను సేకరించే వ్యవస్థ ఉందని, దీని ద్వారా వివరాలను అక్రమంగా సేకరిస్తుందని వివరించింది. పాకిస్తాన్‌లో ఒసామా బిన్‌ లాడెన్‌ జాడ వెతికేందుకు క్రాస్‌ మ్యాచ్‌కు సంబంధించిన పరికరాలను అమెరికా మిలిటరీ వాడుకుందని 2011లో వార్తలు వచ్చాయి. 

#

Tags

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)