amp pages | Sakshi

చీవాట్లు పెట్టినా... చులకన చేసినా..

Published on Fri, 01/26/2018 - 13:16

కర్నూలు(ఆర్‌యూ):   రాయలసీమ యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిబంధనలకు అర్థం తెలియదా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనేందుకు నిదర్శనాలు కోకొల్లలు.  ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొన్నా మా తీరింతే అన్నట్టుగా ఉంది.  కోర్టులు చీవాట్లు పెట్టినా... కొందరు విద్యార్థులు చులకనగా మాట్లాడినా వెనక్కి తగ్గరనేందుకు  రెండు సంవత్సరాల కాలపరిమితితో నియమించబడిన ఒక కాంట్రాక్ట్‌ ఉద్యోగికి ఇంక్రిమెంట్‌ ఇవ్వడానికి పూనుకోవడం మరో సాక్ష్యంగా నిలిచింది. ఈ విషయాన్ని గుర్తించిన  నాన్‌ టీచింగ్‌ సిబ్బంది గురువారం మూకుమ్మడిగా ఫైల్‌ సిద్ధం చేసిన అధికారిని నిలదీయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేశానని చెప్పడంతో  గుట్టు బట్టబయలైంది. 

అంతా మా ఇష్టం...
ఆర్‌యూ ఉన్నతాధికారులు అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తునారనేందుకు ఇంక్రిమెంట్‌ ఇవ్వదలచిన కాంట్రాక్టు ఉద్యోగికి నెలకు రూ. 40 వేలకు పైగా జీతం ఇవ్వడంతోపాటు  హెచ్‌ఆర్‌ఎ ఇవ్వడం నిదర్శనం.  సర్వీస్‌ రిజిస్టర్‌ లేకుండానే  ఇంక్రిమెంట్లు  ఎలా ఇస్తారనేది అర్థమవ్వని విషయం.  అంతర్గత  ఒప్పందం మేరకు  నియమించుకుని దొడ్డిదారిన పర్మనెంట్‌ చేయడానికే  ఈ ఎత్తుగడని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. వాస్తవానికి ఈ ఉద్యోగానికి సూపరింటెండెంట్‌ స్థాయి ప్రభుత్వ ఉద్యోగి అర్హుడు. అయితే ప్రైవేట్‌ ఐటీ సంస్థలో పని చేస్తున్న ఈ వ్యక్తిని నియమించడమే నిబంధనలకు విరుద్ధం.   అప్పట్లో విద్యార్థులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు కూడా.  వైస్‌ చాన్స్‌లర్‌ నరసింహులు పదవీ కాలం ఏప్రియల్‌ 9వ తేదీతో ముగుస్తుంది. ఈలోగా  ఇంక్రిమెంట్లు ఇచ్చేస్తే భవిష్యత్తులో ఈ ఇంక్రిమెంట్ల ఆధారంగా  పర్మినెంట్‌ ఉద్యోగిగా స్థిరపడేందుకు   ఎత్తుగడ  అనే  అనుమానం వ్యక్తం అవుతున్నాయి.  

నాన్‌టీచింగ్‌ సిబ్బంది పాపమేంటి ?   
వర్సిటీలో టైం స్కేల్‌ పొందుతున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బంది 12 మంది ఉన్నారు.  ఖాళీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు  22 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వీరిని వదిలేసి  మూడేళ్ల నుంచి మాత్రమే పని చేస్తున్న ఆ వ్యక్తిని పర్మనెంట్‌ చేయడానికి పావులు కదపడంలో మతలబ్‌ ఏంటి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అదేవిధంగా 110 మంది చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న కంట్రాక్టు సిబ్బందికి టైంస్కేలు ఇవ్వని ఉన్నతాధికారులు సదరు ఉద్యోగికి అడ్డదారిన ఇంక్రిమెంట్‌  ఇచ్చేందుకు చేస్తున్న తీరును ఉద్యోగులు తప్పుపడుతున్నారు.  

Videos

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..

రాక్షస పరివార్..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?