amp pages | Sakshi

పులి గాండ్రిస్తోంది!

Published on Sat, 01/27/2018 - 16:09

అచ్చంపేట : నల్లమల అమ్రాబాద్‌ అభయారణ్య ప్రాంతంలో జాతీయ జంతువుల మనుగడ కొనసాగుతుంది. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు చేపట్టిన గణ నలో 21 పెద్ద పులులు, 57 చిరుతల అ డుగు జాడలను సేకరించారు. ఇప్పటికే మాంసాహార జంతువుల గణన పూర్తి కా గా శనివారం నుంచి రెండురోజులపాటు శాఖాహార జంతువుల గణన చేపడుతారు. క్షేత్రస్థాయిలో సేకరించిన జాడల (పాదముద్రలు)ను సిబ్బంది ఇప్పటికే అటవీశాఖ ఫీల్డ్‌ డైరెక్టర్‌ సీసీ వినోద్‌కుమార్, డీఎఫ్‌ఓ జోజీలకు వివరిస్తూ నివేదిక అందజేశారు.

అమ్రాబాద్‌ అభయారణ్యంలో 214 బీట్లలో చేపట్టిన గణనలో పులులు, చిరుతల పాదముద్రలు, మలం , వెంట్రుకలు సేకరించిన అటవీశాఖ అధికారులు వీటి సంఖ్యను తేల్చే ందుకు పరీక్షల నిమిత్తం పంపించారు. పరీక్షల అనంతరం వాటి లెక్కలను పరిగణలోకి తీసుకుంటారు. నిర్ధేశించిన ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది, అటవీ అకాడమీ విద్యార్థులు, ఎన్‌జీఓలు లైనింగ్‌ల వెంట కాలినడకన తిరుగుతూ పులులు, చిరుత పులుల పాదముద్రలను సేకరించారు. ప్రతి బీట్‌లో ఇద్దరు చొప్పున గణనలో పాల్గొన్నారు.
 
ఎక్కడెక్కడ ఎన్ని..
అచ్చంపేట రేంజ్‌ పరిధిలోని బాణాల, చౌటపల్లి బీట్లలో 2 పులులు, 12 చిరుతలు, మన్ననూర్‌లోని 10 బీట్లలో 8 పులులు, 20 చిరుతలు, దోమలపెంట రేంజ్‌ పరిధిలో బోరెడ్డిపల్లి, కొమ్మనపెంట, వటవర్లపల్లి బీట్లలో 2 పులులు, అమ్రాబాద్‌ రేంజ్‌ పరిధిలోని కొల్లంపెంట, పర్షాబాద్‌ నార్త్‌ బీట్లలో 3 పులులు, 9 చిరుతలు, 4 ఎలుగుబంట్లు, మద్దిమడుగు రేంజ్‌లో గీసుగండి, బాపన్‌పాడు బీట్లలో 2 పులులు, 6 చిరుతలు, కొల్లాపూర్‌ రేంజ్‌ పరిధిలోని ఎర్రపెంట, ఎర్రగుండం పెంట బీట్లలో 2 పులులు, 9 చిరుతలు, లింగాల రేంజ్‌లో మర్లపాయ బీట్‌లో 2 పులుల, 5 చిరుత ల పాదముద్రలు లభించాయి. గతంలో ఎప్పుడూ కూడా బల్మూర్‌ మండలం బాణాల, అచ్చంపేట మండలం చౌటపల్లి ప్రాంతంలో పులుల జాడలు కనిపించలేదు. మొదటిసారి ఇక్కడ పులులు, చిరుతల జాడలు లభించడం గమనార్హం. బాణాల, బిల్లకలు సమీపంలో రుసుల చెరువు ఉండటంతో నీళ్లు తాగడానికి వచ్చిన పులి ఈ ప్రాంతం లో సంచరించి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. 

దక్షిణ భారతదేశంలోనే..
దేశంలోని 50 పులుల అభయారణ్యంలో అమ్రాబాద్‌ అయారణ్యం 45వ స్థానంలో ఉండగా.. దక్షణ భారతదేశంలో ఇదే అతిపెద్ద టైగర్‌ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం 2,611.39 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్త రించి ఉంది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ అభయారణ్యం కాగా 445.02 చదరపు కి.మీ బఫర్‌జోన్‌గా ఉంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్, నల్గొండ జిల్లా నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ పులు లు, చిరుతలతోపాటు ఇతర జంతువులు, పక్షుల లెక్కలు కూడా ఇందులో పొందుపరిచా రు. 200 రకాల పక్షులు, క్షీరదాలు, వంద రకాల సీతాకోక చిలకలు, 50 రకాల క్రి ములున్నాయి. అటవీశాఖ కూడికలు, తీసివేతల ప్రకారం పులులు, చిరుతల లెక్క లు చెబుతున్నారే తప్ప వాస్తవంగా ఎన్ని ఉన్నాయన్న విషయం ఎవరికీ తెలియడం లేదు. ఇంత వరకు పులుల సంఖ్య చెబుతున్నారే తప్ప వాటి పిల్లల సంఖ్య.. సీసీ పుటేజీల్లో కనిపించినట్లు ఎక్కడా చెప్పడం గాని.. చూపడం గాని జరగడం లేదు.
 

Videos

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)