amp pages | Sakshi

సినిమా రివ్యూ: ’1’ నేనొక్కడినే

Published on Fri, 01/10/2014 - 15:43

ప్లస్ పాయింట్స్
మహేశ్‌బాబు యాక్టింగ్
 ఇంటర్వెల్ సీన్
 రత్నవేలు ఫోటోగ్రఫీ
 క్లైమాక్స్
 పీటర్ హెయిన్స్ ఫైట్స్
 
 మైనస్‌పాయింట్స్
 ఫస్టాఫ్‌లో కన్‌ఫ్యూజన్
 ఎంటర్‌టైన్‌మెంట్ మిస్సింగ్ 
ఓ మానసిక వ్యాధితో బాధపడే గౌతమ్ (మహేశ్‌బాబు) ఓ రాక్‌స్టార్. తన తల్లితండ్రులను చంపిన హంతకులపై పగ తీర్చుకోవడమనేది ఈ చిత్రం కథ. గౌతమ్ తల్లి తండ్రులను ఎవరు, ఎందుకు చంపారు అనే ప్రశ్నలకు సమాధానమే ’1’ నేనొక్కడినే చిత్రం. 
 
ఇక మహేశ్ బాబు గురించి...
ఈ చిత్రంలో రాక్‌స్టార్‌గా, సైకాలజీ డిజార్డర్‌తో బాధపడే వ్యక్తిగా, తల్లితండ్రుల మరణానికి కారణమైన హంతకులపై రివెంజ్ తీసుకునే గౌతమ్ పాత్రలో మహేశ్ నటన ఎక్స్‌ట్రార్డినరీగాఉంది.  మహేశ్ నటనను మరో కోణంలో చూడానికి అభిమానులకు ఈ చిత్రంలో అవకాశం కలిగింది. కామెడీ మార్కు డైలాగ్స్, టైమింగ్ లాంటి మహేశ్‌ అదనపు అంశాలు కనిపించకపోవడం ప్రేక్షకులకు నిరాశ కలిగించే అంశం. అయితే ఇప్పటివరకు వచ్చిన మహేశ్ చిత్రాల్లో ‘1’ నేనొక్కడినే ఓ డిఫరెంట్ చిత్రం. తెలుగు ప్రేక్షకులు తన నుంచి ఏమి ఆశిస్తారో తెలిసి కూడా.. మూస పాత్రలకు బ్రేక్ పెట్టి.. ఓ ప్రత్యేక తరహా పాత్రలో నటించేందుకు మహేశ్ చూపిన తెగువకు హ్యాట్సాఫ్. ‘1’ చిత్రంలో మహేశ్ 'వన్ మ్యాన్ ఆర్మీ'. ఏది ఏమైనా మహేశ్ నటనను ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుసుకోవాలంటే కాస్త ఆగాల్సిందే.
 
ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ‘ప్రిన్స్’ గౌతమ్ మెచ్యూరిటీతో కూడిన నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. తొలి చిత్రమైనా కూడా గౌతమ్ అదరగొట్టేశారు. 
 
కృతి సనన్ జర్నలిస్ట్‌గా, గౌతమ్ ప్రేయసి సమీరగా పర్వాలేదనిపించింది.  ఈ చిత్రంలో కొంత ప్రాధాన్యం ఉన్న పాత్ర కృతి సనన్‌కు దక్కింది. కొత్త నటి అనే ఫీలింగ్‌ను కలిగించకుండా కృతి బాగానే జాగ్రత్త పడింది. 
 
గులాబ్ సింగ్ పాత్రలో డ్రైవర్‌గా పోసాని కృష్ణమురళీ కనిపించి.. పర్వాలేదనిపించారు. జాన్ బాషాగా పోలీస్ పాత్రలో షాయాజీ షిండే, ప్రదీప్ రావత్, కెల్లీ దోర్జీ ప్రతినాయక పాత్రలో తనదైన స్టైల్‌ను ప్రదర్శించారు. ముఖ్యంగా ముగింపులో నాజర్ మరోసారి మెరుగైన నటనను ప్రదర్శించారు. 
 
మహేశ్ నటనకు దీటుగా రత్నవేలు చక్కటి ఫొటోగ్రఫీతో ‘1’ చిత్రాన్ని మాస్టర్ పీస్‌గా మలిచారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ ప్రాణం పోసింది. ఓ తెలుగు చిత్రానికి కూడా హాలీవుడ్ అప్పీల్‌ను తీసుకురావడంలో ఫోటోగ్రఫీ ఈ చిత్రానికి ఎస్సెట్ గా మారింది. లండన్, గోవాలో చిత్రీకరించిన సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్‌ ప్రేక్షకులను ఓ చక్కటి అనుభూతిని కలిగిస్తాయి. 
 
ఇక మహేశ్ బాబు నటన, రత్నవేలు ఫొటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ యాక్షన్ సీన్లకు తానేమీ తక్కువ కాదని దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్‌తో ప్రేక్షకులకు ఆకట్టుకున్నారు. భావోద్వేగాలు, యాక్షన్ సీన్లలో దేవీ నేపథ్య సంగీతం లైవ్లీగా ఉంది. 
 
విశ్లేషణ:
చాలా కథ చాలా సింపుల్‌గా అనిపించినా.. ’1’ చిత్రానికి ఓ సామాజిక అంశాన్ని జోడించిన కథతో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన విధానం హాలీవుడ్ చిత్రాలను మరిపించేలా ఉంది. దర్శకుడు ఎంచుకున్న కథనాన్ని టాలీవుడ్ ఆడియెన్స్‌ ఆదరిస్తారా అనే స్రశ్కు కాస్తా వేచి చూడాల్సిందే. అయితే తొలి భాగంలో కథనం కన్‌ఫ్యూజన్‌తో ప్రేక్షకులను తికమక పెట్టింది. ప్రేక్షకుల సహనానికి పరీక్ష అన్నట్టుగా మారిన సమయంలో ఇంటర్వెల్ బ్యాంగ్ మళ్లీ ప్రేక్షకులకు కొంత ఊరట కలిగించింది. ఆ తర్వాత సెకండాఫ్‌లో కూడా అదే తీరు కొనసాగించినా.. క్లైమాక్స్‌లో చక్కటి ముంగిపుతో ప్రేక్షకులను సంతృప్తి పరిచడంలో దర్శకుడు సుకుమార్ సక్సెస్ అయ్యారు. సుకుమార్ కథనం, ఇంటలెక్చువల్ థింకింగ్, మేకింగ్ స్టైల్ టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉందనేది ఓ వాదన. ఈ చిత్రంలో అనేక చిక్కుముడులు ప్రేక్షకులను కొంత గందరగోళానికి గురి చేస్తాయి.  ఇక ’1’ చిత్రం హిట్టా, ఫ్లాపా? అనే విషయాలను పక్కన పెడితే.. ‘1’ మాత్రం మేకింగ్ పరంగా టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. ప్రస్తుత తెలుగు చిత్రాల స్థాయిని పెంచే స్థాయిలో మహేశ్ బాబు నటన ఉందని చెప్పవచ్చు. మూస చిత్రాలకు అడిక్ట్ అయిన తెలుగు సినీ అభిమానుల, మహేశ్‌బాబు నుంచి రెగ్యులర్ స్టఫ్, వినోదాన్ని ఆశించే అభిమానులకు, రెగ్యులర్ ప్రేక్షకుల అంచనాలకు ఈ చిత్రం దూరంగా ఉండటం కొంత నిరాశ కలిగించే అంశం. నటుడిగా మహేశ్, దర్శకుడుగా సుకుమార్ ఓ కొత్త తరహా చిత్రాన్ని అందించేందుకు చేసిన ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా ప్రశ్నకు ఇప్పుడే దొరకపోవచ్చు. ఏది ఏమైనా లాజిక్‌లను పక్కన పడితే.. మహేశ్ నుంచి ఓ డిఫరెంట్ చిత్రం వచ్చిందనే భావన వ్యక్తమైనా.. తెలుగు ప్రేక్షకుల టేస్టుకు దూరంగా ఉందనేది కాదనలేని వాస్తవం. అయితే సంక్రాంతి సీజన్లో ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశాలున్నాయి. 
-రాజబాబు అనుముల

 

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)