amp pages | Sakshi

గోప్యత పాటిస్తున్న నటుడి కుటుంబసభ్యులు!

Published on Sat, 12/20/2014 - 09:14

'ఆహుతి' చిత్రాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న  సినీ నటుడు ఆహుతి ప్రసాద్ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు పెదవి విప్పటం లేదు. కాగా ఆహుతి ప్రసాద్.. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఇంతకీ  అనారోగ్యం ఏమిటనేది ...ఆహుతి ప్రసాద్  కుటుంబ సభ్యులు గోప్యత పాటిస్తున్నట్లు ఆయనతో సన్నిహితంగా ఉండే ఒకరు తెలిపారు. '

ఆహుతి ప్రసాద్కు ఫోన్ చేసినా... నాన్న బిజీగా ఉన్నారని ఆయన కుమారుడు సమాధానం ఇస్తున్నారని, అయితే అసలు విషయం తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లితే...ఆహుతి ప్రసాద్ బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారని' ఆయన పేర్కొన్నారు. కాగా  ఆహుతి ప్రసాద్ కేన్సర్తో బాధపడుతున్నారని, ఆయన రెండు నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఆహుతి ప్రసాద్ అసలు పేరు జనార్దన వరప్రసాద్‌. ఆయన సొంతూరు కృష్ణాజిల్లాలోని ముదినేపల్లి పక్కనే ఉన్న కోడూరు. 1986లో 'విక్రమ్' సినిమా ద్వారా ఆహుతి ప్రసాద్ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. అనంతరం ఆయన నటించిన 'ఆహుతి' పెద్ద బ్రేక్ ఇచ్చింది. గులాబి, నిన్నే పెళ్లాడతా, చంద్రమామ, కొత్త బంగారులోకం, బెండు అప్పారావు, సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం  సినిమాల్లో ఆహుతి ప్రసాద్ చెప్పుకోదగ్గ పాత్రలు పోషించారు. 'చందమామ' సినిమాకి బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నంది అవార్డుతో పాటు, గుమ్మడి అవార్డు అందుకున్నారు.

Videos

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)