amp pages | Sakshi

నటి ఆశ్చర్యకర సమాధానం

Published on Sat, 05/19/2018 - 18:15

సిని పరిశ్రమలో కలకలం రేపిన ‘కాస్టింగ్‌ కౌచ్‌’ గురించి పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వినిపించిన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ కాస్టింగ్‌ కౌచ్‌ను సమర్ధించగా...రాధికా ఆప్టే లాంటి హీరోయిన్‌లు తమకు అలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపిన సంగతి తెలిసిందే. ఇదే విషయం గురించి బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అలియా భట్‌ను అడగ్గా ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారు. ‘ప్రస్తుతం కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం బాగా వెలుగులోకి వచ్చింది. అయితే నా ఉద్దేశ్యం ప్రకారం ఇలాంటి అంశాల గురించి చర్చిస్తే పరిశ్రమ గురించి ప్రజలకు ప్రతికూల భావాలను రేకెత్తించిన వారమవుతాం. అది చిత్ర పరిశ్రమకు మంచిది కాదు’ అని తెలిపారు.

అంతేకాక ‘జీవానాధరం కోసం కష్టపడే యువతీ, యువకులందరికి ఏదో ఒక సందర్భంలో ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కొందరు దీన్ని అవకాశంగా తీసుకుని వారి పనులు జరిపించుకోవాలని చూస్తారు. అలాంటి వారి ప్రలోభాలకు లొంగకుండా ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మేలు. అన్నిటికంటే ముఖ్యంగా ఇటువంటి పరిస్థితులు తారసపడినప్పుడు తల్లిదండ్రులకు చెప్పాలి. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని తెలిపారు. ప్రస్తుతం అలియా నటించిన రాజీ సినమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడతున్న సంగతి తెలిసిందే

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌