amp pages | Sakshi

‘సూర్యగ్రహణం అప్పుడు సరిగా ప్రార్థించకపోతే’

Published on Sun, 06/21/2020 - 20:31

హీరో అల్లు శిరీష్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమాల గురించే కాకుండా.. ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను కూడా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లలో పోస్ట్‌ చేస్తూ ఉంటారు. తాజాగా ఇంట్లో జెంగా ఆడుతున్న ఓ చిన్న వీడియోను శిరీష్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ఆటలో భాగంగా శిరీష్‌ చెక్క ముక్కను బయటకు తీస్తున్న సమయంలో టవర్‌ కూలిపోయింది. దీంతో అతను ఓటమి చెందాడు. ఈ ఫన్నీ వీడియోను షేర్‌ చేసిన శిరీష్‌.. సూర్య గ్రహణం సమయంలో సరిగా ప్రార్థించకపోతే ఇలానే జరుగుతోంది అని పేర్కొన్నారు.(చదవండి : ఫ్యాక్ట్‌‌ : నయన్‌-విఘ్నేశ్‌లకు కరోనా సోకిందా?)

ఇక, జెంగా ఆట విషయానికి వస్తే ఇందులో.. ముందుగా చెక్క ముక్కలను టవర్‌ మాదిరిగా పేర్చుతారు. ఈ ఆటను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆడతారు. ఈ ఆటలో పాల్గొనవారు టవర్‌ కూలిపోకుండా.. వంతుల వారీగా మధ్యలో ఉన్న ఒక్కో చెక్కముక్కను బయటకు తీసి పైభాగంలో పెట్టాలి. అయితే ఎవరు చెక్క ముక్క బయటకు తీసేటప్పుడు టవర్‌ కూలిపోతుందో వాళ్లు ఓటమి చెందినట్టు. అంతకుముందు ఫాదర్స్‌ డే సందర్భంగా తన తండ్రి అల్లు అరవింద్‌కు శిరీష్‌‌ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నేడు తన తల్లి నిర్మల పుట్టిరోజు సందర్భంగా విషెస్‌ చెప్పారు. 

Videos

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌