amp pages | Sakshi

అనసూయను ఆట పట్టించిన సుమ!

Published on Sun, 03/18/2018 - 21:07

సాక్షి, సినిమా: డైరెక్టర్‌ సుకుమార్‌ను తాను మామూలుగా నస పెట్టలేదని స్టార్ యాంకర్, నటి అనసూయ తెలిపారు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను విశాఖపట్నంలో నిర్వహించింది మూవీ యూనిట్. ఈ వేడుకలో పాల్గొని అనసూయ మాట్లాడారు. ముందుగా అందరికీ శ్రీవిళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 'నా ధైర్యం సుకుమార్. మూవీ యూనిట్ రంగస్థలం కోసం ఎంతో కష్ట పడింది. సుకుమార్‌ను నేను మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. రామ్‌చరణ్ నా ఫెవరెట్ యాక్టర్. అయితే ఆయనతో అత్త అని పిలిపించుకోనని గొడవ (మారాం) చేశాను. చిట్టిబాబు (చరణ్)కు మాత్రమే నేను రంగమ్మత్తను (మూవీ పాత్ర).

ప్రస్తుత జనరేషన్ వాళ్లు 1980లో ఉన్నవాళ్ల పద్ధతులు, అలవాట్లు తెలుసుకోవాలంటే రంగస్థలం చూడాల్సిందే. మార్చి 30న మూవీ విడుదల కానున్న రంగస్థలాన్ని ఆదరించాలని' అనసూయ కోరారు. చివరగా యాంకర్ సుమ, అనసూయను ఆటపట్టించారు. మీరు రామ్‌చరణ్‌కు అక్కగా కాదు.. చెల్లెలిగా అయితే అభిమానులు నమ్ముతారని ఆ పాత్ర ఇస్తారా అని సుకుమార్‌ను మీరు అడిగారట నిజమేనా  అని అనసూయను సుమ అడిగారు. అయ్యో.. సుకుమార్ సార్ ఏంటిది అంటూ అనసూయ అన్నారు. మీరు (అనసూయ) అనుకోలేదా, అయితే తాను అలా అనుకున్నానంటూ సుమ అనే సరికి అక్కడ నవ్వులే నవ్వులు.

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌