amp pages | Sakshi

ఆమె బయోపిక్‌ను నిషేధించండి

Published on Sat, 11/17/2018 - 11:39

తమిళనాడు,పెరంబూరు: అనిత జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న చిత్రంపై నిషేధం విధించాలంటూ ఆమె తండ్రి చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గత ఏడాది నీట్‌ పరిక్షల్లో ఉత్తీర్ణత కాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్ధిని అనిత. అరియలూర్‌ జిల్లా కుళుమూర్‌ గ్రామానికి చెందిన షణ్ముగం కూతురు అనిత. ప్లస్‌ 2 పరీక్షల్లో 1200లకు గానూ 1176 మార్కులు తెచుకున్న ఈ విద్యార్థిని డాక్టరు కావాలని కలలు కనింది. అయితే నీట్‌ పరిక్షల్లో ఫెయిల్‌ కావడంతో తన కల కల్లలైపోయిందని భావించి మనస్తాపంతో గత ఏడాది సెప్టెంబరు ఒకటవ తేదీన ఆత్మహత్య చేసుకుంది. కాగా అనిత జీవిత చరిత్ర సినిమాగా రూపొందుతోంది.

దీంతో ఆ చిత్రాన్ని నిషేధించాలంటూ అనిత తండ్రి షణ్ముగం చెన్నై హైకోర్టులో పిటీషన్‌  దాఖలు చేశాడు. అందులో ఆయన పేర్కొంటూ తన కూతురు అనిత జీవిత చరిత్రను డా.ఎస్‌.అనిత ఎంబీబీఎస్‌ పేరుతో ఆర్‌జే పిక్చర్స్‌ పతాకంపై అజయ్‌కుమార్‌ అనే దర్శక నిర్మాత చిత్రంగా రూపొందిస్తున్నట్లు గత మే నెల 13వ తేదీన ప్రకటన చేశారన్నారు. అందులో బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో ఫేమ్‌ జూలీ అనిత పాత్రలో నటిస్తున్నట్లు, చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకున్నట్లు పేర్కొన్నారని అన్నారు. అయితే అజయ్‌కుమార్‌ అనే దర్శకుడు అనిత జీవిత చరిత్రను చిత్రంగా చేయడానికి తమ నుంచి అనుమతి పొందలేదన్నారు. కాబట్టి ఆ చిత్రంపై నిషేధం విధించాలని, తన కూతురు పేరును ఉపయోగించినందుకు నష్ట పరిహారంగా రూ.25 లక్షలు చెల్లించేలా ఆదేశించాలని కోరారు. ఈ కేసును గురువారం విచారించిన న్యా యమూర్తి కే.కల్యాణసుందరం డా. ఎస్‌.అనిత ఎంబీబీఎస్‌ చిత్ర దర్శక నిర్మాతకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు.

Videos

రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్

లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు

లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు

పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం

ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ట్వీట్

జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)