amp pages | Sakshi

నాన్నగారి పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతం

Published on Fri, 03/30/2018 - 00:59

‘‘ఎన్టీఆర్‌ నటించిన ‘పాతాళభైరవి, లవకుశ, దేశోద్ధారకులు’ వంటి విజయవంతమైన చిత్రాలు విడుదలైన ఈ రోజున ఆయన బయోపిక్‌ ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను చూస్తే ఎన్టీఆర్‌ గురించి తెలియనివారికి కూడా పూర్తిగా తెలిసేలా, చక్కటి సందేశంతో  రూపొందించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఉప రాష్ట్రపతిఎం. వెంకయ్యనాయుడు. తేజ దర్శకత్వంలో ఎన్‌.బి.కే ఫిలిమ్స్‌ బ్యానర్‌పై వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పణలో నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘యన్‌.టి.ఆర్‌’.

బాలకృష్ణ టైటిల్‌ రోల్‌లో నటిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. విష్ణు సహనిర్మాత. దుర్యోధనుడు గెటప్‌లో ఉన్న బాలకృష్ణపై తీసిన తొలి సీన్‌కి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, వెంకయ్యనాయుడు క్లాప్‌ ఇచ్చారు. ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. నందమూరి మోహనకృష్ణ, రామకృష్ణ, సాయికృష్ణ దర్శక–నిర్మాతలకు స్క్రిప్ట్‌ అందించారు.

‘‘భారతదేశం గర్వించదగ్గ అందాల నటుడు ఎన్టీఆర్‌గారు. బాలయ్యగారిని చూస్తుంటే ఎన్టీఆర్‌గారిని చూసినట్లుంది’’ అన్నారు టి. సుబ్బరామిరెడ్డి. ‘‘ఎన్టీఆర్‌ బయోపిక్‌ చేస్తున్న బాలయ్య ధన్యుడు. దర్శకత్వం వహిస్తున్న తేజ అదృష్టవంతుడు’’ అన్నారు రాఘవేంద్రరావు. ‘‘ఎన్టీఆర్‌ చరిత్రను తెరపైకి తీసుకురావడమే సాహసం. దానికి బాలకృష్ణ మాత్రమే అర్హుడు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌.‘‘నాన్నగారి పాత్రలో నటిస్తుండటం నా పూర్వజన్మ సుకృతం’’ అన్నారు బాలకృష్ణ.

‘‘దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు సహనిర్మాత విష్ణు. ‘‘ఎన్టీఆర్‌గారి బయోపిక్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం రావడం అదృష్టం. బాగా చేయాలని ప్రయత్నిస్తున్నాను.  కథ బాగా వచ్చింది. బాలకృష్ణగారు బాగా చేస్తారు. ఏమైనా చిన్నతప్పులు ఉంటే ఫ్యాన్స్‌ క్షమించాలి’’ అన్నారు తేజ. సంగీత దర్శకుడు కీరవాణి, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, సాయి మాధవ్‌ బుర్రా తదితరులు పాల్గొన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)