amp pages | Sakshi

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ ఫైర్‌

Published on Sat, 08/10/2019 - 16:50

బిగ్‌బాస్‌ ఇచ్చిన ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే టాస్క్‌ రక్తపాతాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్‌లో అలీ రెజా, హిమజ మధ్య జరిగిన గొడవ కూడా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంలో తలదూర్చిన తమన్నాపై కూడా అలీ రెజా విరుచుకుపడ్డాడు. ఈ టాస్క్‌ పెట్టిన చిచ్చు అంత తొందరగా చల్లారలేదు. చివరకు హిమజ.. అలీ రెజా కాళ్లు పట్టుకుని ఏడ్చే వరకు వెళ్లింది. తన నుంచి సారీ మాత్రమే ఆశించానని, కాళ్లు పట్టుకోమని అడగలేదని అలీ రెజా వివరించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ గొడవలో హిమజ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కొడతాను అని బెదిరించినట్లు పదేపదే వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇదే వ్యవహారాన్ని వీకెండ్‌లో నాగ్‌ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

అలీ రెజాపై నాగ్‌ విరుచుకుపడ్డట్లు ఓ ప్రోమోను విడుదల చేశారు. తనకు డ్రెస్సింగ్‌ ఉంది కానీ కామన్‌సెన్స్‌ లేదంటూ అలీపై ఫైర్‌ అయ్యాడు. ఇంతవరకు హౌస్‌మేట్స్‌ చేసిన తప్పులను  నవ్వుతూ సరిచేసేందుకు ప్రయత్నించిన నాగ్‌.. మొదటిసారిగా ఫైర్‌ అయినట్లు కనబడుతోంది. మరి ఈ వ్యవహారంలో నాగ్‌ ఇచ్చిన తీర్పు ఏంటో? రవికృష్ణకు గాయం కావడం, అతన్ని ప్రోత్సహించిన శ్రీముఖి, ఐడియా ఇచ్చిన మహేష్‌ను నాగ్‌ ఏవిధంగా మందలించాడో చూడాలి. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లే మూడో వ్యక్తి ఎవరో రేపు తెలిసిపోనుంది. అయితే సోషల్‌ మీడియా ట్రెండింగ్‌ ప్రకారం తమన్నా సింహాద్రి ఎలిమినేట్‌ కానుందని తెలుస్తోంది. మరి ఇది నిజం అవుతుందో కాదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఎదురుచూడాలి.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)