amp pages | Sakshi

బసంతి కళాశాలలో...

Published on Fri, 10/25/2013 - 01:17

కళాశాలలో అడ్మిషన్ తీసుకోగానే ప్రతి విద్యార్థికీ ఓ గుర్తింపు వస్తుంది. అలాగే... కళాశాల.. విద్యార్థి బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. అందుకే కళాశాల జీవితం ప్రతి విద్యార్థికీ ప్రత్యేకం. ఆ రోజులనాటి మాధుర్యాన్ని గుర్తు చేసే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘బసంతి’.  ప్రసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్, అలీషాబేగ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ‘బాణం’ఫేం దంతలూరి చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దంతలూరి చైతన్య మాట్లాడుతూ -‘బాణం’ కథ కంటే ముందే సిద్ధం చేసుకున్న కథ ఇది.
 
  బసంతి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో చదివే విద్యార్థుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఈ కథ తయారు చేశాం. సాంకేతికంగా కూడా సినిమా బాగుంటుంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. నవంబర్‌లో పాటల్ని, డిసెంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రణధీర్ గట్ల, నవీనా జాక్సన్, తనికెళ్ళ భరణి, సమాజీ షిండే, ఆనంద్, ధన్‌రాజ్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీకాంత్ నాయుడు విస్సా, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: అనిల్ బండారి, పి.కె.వర్మ, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : వివేక్ కూచిభొట్ల.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌