amp pages | Sakshi

హీరో సుదీప్‌కు అరెస్ట్‌ వారెంట్‌

Published on Thu, 03/28/2019 - 09:00

బెంగళూరు : కన్నడ హీరో, ఈగ ఫేమ్ కిచ్చా సుదీప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.  కాఫీ ఎస్టేట్‌ వివాదంలో కోర్టుకు గైర్హాజరు కావడంతో ఆగ్రహించిన కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. చిక్‌మంగళూరు కోర్టులో వరుస వాయిదాలతో అవకాశమిచ్చినా ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాకపోవడంతో సుదీప్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు చిక్‌మంగళూరు జెఎంఎఫ్‌సీ కోర్ట్  ఉత్తర్వులు జారీ చేసింది. మే 22వ తేదీ లోగా సుదీప్‌ ఆచూకి తెలుసుకొని కోర్టు ముందు హాజరు పరచాల్సిందిగా కర్ణాటక పోలీసులను ఆదేశించిందిజ ప్రస్తుతం ఆ వార్త  శాండల్‌వుడ్ ఇండస్ట్రీ హాట్‌ టాపిక్‌గా నిలిచింది. 

కర్ణాటక చిక్‌మంగళూరులోని కాఫీ ప్లాంటేషన్ యజమాని దీపక్ పటేల్ ఫిర్యాదు మేరకు నటుడు సుదీప్, కన్నడ టీవీ రియాలిటీ షో  సుదీప్‌కు చెందిన ప్రొడక్షన్‌ హౌస్‌ కిచ్చా క్రియేషన్స్‌పైనా,  డైరెక్టర్ మహేష్‌లపై కేసు నమోదైంది. 2016లో కన్నడ టీవీ షో వారసదార షూటింగ్‌ కోసం తన ఎస్టేట్‌ను అద్దెకు తీసుకొన్నారు. ఇందుకు కోటి 80 లక్షల రూపాయలను చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌ రూ. 50 వేలు మాత్రమే ఇచ్చి మిగతా సొమ్మును ఎగ్గొట్టారని, అలాగే తన కాఫీ తోటల్ని, మరికొంత వారసత్వ ఆస్తిని ధ్వంసం చేశారని దీపక్‌ ఆరోపించారు. ఒప్పందానికి భిన్నంగా లోపల ఒక సెట్‌ను కూడా నిర్మించారనీ, తనకు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించకుండా మోసం చేశారంటూ మొదట జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. అయితే ఇది సివిల్‌ వివాదం కావడంతో  ఎస్పీ సలహా మేరకు కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు కాఫీ ఎస్టేట్ ఓనర్ దీపక్‌.  ఈ కేసులో విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడనేది ప్రధాన ఆరోపణ. 


 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)