amp pages | Sakshi

25వేల మందికి స‌ల్మాన్ సాయం

Published on Sun, 03/29/2020 - 16:30

ప్రేక్ష‌క లోకాన్ని అల‌రించే సినీతార‌లు క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ మేమున్నామంటూ ముందుకు వ‌స్తూ రియ‌ల్ హీరోలు అనిపించుకుంటున్నారు. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా క‌రాళ నృత్యం చేస్తుండ‌టంతో ప‌లువురు సెల‌బ్రిటీలు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు తోచిన సాయం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో బాలీవుడ్ భాయ్‌జాన్ స‌ల్మాన్‌ఖాన్ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేసే చిన్నాచిత‌కా ఆర్టిస్టుల‌కు ఆప‌న్న‌హ‌స్తం అందించ‌నున్నాడు. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేప‌థ్యంలో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేసే క‌ళాకారుల ప‌రిస్థితి కూడా ద‌య‌నీయంగా మారింది. అలాంటి వారికి స‌హాయం అందించేందుకు సినీ ప్ర‌ముఖులు ముందుకు రావాల‌ని ఎఫ్‌డ‌బ్ల్యూఐసిఈ (ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్) అధికార ప్ర‌తినిధి బీఎన్ తివారీ కోరాడు.

దీంతో తాప్సీ ప‌న్ను, క‌ర‌ణ్ జోహార్ వంటి ప్ర‌ముఖులు మేము సైతం సాయం అందించేందుకు అంటూ ప్ర‌తిజ్ఞ పూనారు. స‌ల్మాన్‌ఖాన్ ఓ అడుగు ముందుకేసి ఏకంగా 25 వేల మందికి ఆర్థిక చేయూత‌నివ్వ‌డానికి సిద్ధ‌ఫ‌డిపోయాడు. ఈ మేర‌కు బీఎన్ తివారీ మాట్లాడుతూ.. స‌ల్మాన్ త‌న‌ బీయింగ్ హ్యూమ‌న్‌ ఫౌండేష‌న్ ద్వారా దిన‌స‌రి వారీగా ప‌నిచేసే క‌ళాకారుల‌కు ఆర్థిక స‌హాయం అందించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వెల్ల‌డించాడు. అందులో భాగంగా 25 వేల మంది క‌ళాకారుల‌కు నేరుగా అకౌంట్లలో డ‌బ్బులు వేయ‌నున్నాడ‌ని తెలిపాడు. ఈ మేర‌కు వారి అకౌంట్ల వివ‌రాల లిస్టును పంపించ‌నున్న‌ట్లు పేర్కొన్నాడు. (నా ఇంటినే ఆస్పత్రిగా మారుస్తా)

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?