amp pages | Sakshi

అగ్నిగుండం దండకారణ్యం

Published on Tue, 03/08/2016 - 23:00

 ‘‘భారతదేశంలో 12 రాష్ట్రాల్లో దండకారణ్యం విస్తరించి ఉంది. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూరేలా ప్రభుత్వాలు చేపడుతున్న బాక్సైట్, గనుల తవ్వకాల వల్ల అడవులు సర్వనాశనమైపోతున్నాయి. దీనిద్వారా అడవి బిడ్డలైన ఆదివాసీయుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. మందుపాతరలు, ఎన్‌కౌంటర్లతో దండకారణ్యం అగ్నిగుండంగా మారుతోంది. అక్కడ ఎలాంటి మారణహోమం జరగకుండా, ఆది వాసీయులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వాలు కాపాడాలన్నదే ‘దండకారణ్యం’ కథ’’ అని దర్శక-నిర్మాత ఆర్. నారాయణమూర్తి తెలిపారు.
 
 ఆయన నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ‘దండకారణ్యం’ ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి విలేకరులతో మాట్లాడారు. ‘‘బాక్సైట్ గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖ ఏజెన్సీలో ఆదివాసీయులు ఉద్యమం చేస్తున్నారు. పోలీసులు, మిలటరీ దళాలు అక్కడ కాల్పులు జరుపుతుండడంతో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
 
 ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన సంఘటనపై పార్లమెంట్‌లో ప్రస్తావించిన ప్రజా ప్రతినిధులు ఆదివాసీయుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి దండకారణ్యంలో మారణహోమం జరగకుండా శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలి. ప్రజాకవులు గద్దర్, గోరటి వెంకన్న, యశ్‌పాల్, పి.తిరుపతి, కాశీపతి ఈ చిత్రానికి మంచి పాటలు రాశారు. ‘వందేమాతరం’ శ్రీనివాస్, గద్దర్ పాటలు ప్రధాన ఆకర్షణ.
 
  ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. నా గత చిత్రాలను ఆదరించినట్లే ఈ చిత్రాన్నీ ప్రేక్షకులు ఆదరించి, మరిన్ని చిత్రాలు తీసే ప్రోత్సాహం ఇవ్వాలి’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం గద్దర్ స్వయంగా 3 పాటలు రాసి, పాడి, నటించడం విశేషం. సమకాలీన దండకారణ్య చరిత్రకు దర్పణమైన ఈ చిత్రానికి సెన్సార్ దాదాపు 80 ఆడియో కట్స్ విధించడం సంచలనమైంది.
 

Videos

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)