amp pages | Sakshi

ఎవరి లైఫ్‌లోనూ ఆమె ఉండకూడదు

Published on Mon, 03/25/2019 - 00:06

‘‘సూర్యకాంతం’ సినిమా టీజర్‌ చూడగానే థ్రిల్‌ ఫీలయ్యా. సినిమా ఓపెనింగ్‌ టైమ్‌లో నిహారిక పాత్ర బావుందని వరుణ్‌ తేజ్‌తో చెప్పా. లేడీ అర్జున్‌రెడ్డిలాగా బాగా చేసింది. ఈ నెల 29న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మా సంస్థ ద్వారా ఈ సినిమా విడుదల చేస్తున్నాం. ఈ ఏడాది మా బ్యానర్‌లో ఇది మూడో హిట్‌ కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. నిహారిక కొణిదెల, రాహుల్‌ విజయ్‌ జంటగా ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూర్యకాంతం’.

వరుణ్‌ తేజ్‌ సమర్పణలో నిర్వాణ సినిమాస్‌ బ్యానర్‌పై సందీప్‌ ఎర్రంరెడ్డి, సుజన్‌ ఎరబోలు, రామ్‌ నరేష్‌ నిర్మించిన ఈ సినిమా ఈనెల 29న రిలీజ్‌ అవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇద్దరు అమ్మాయిల మధ్యలో స్ట్రగుల్‌ అయ్యే పాత్రలో రాహుల్‌ విజయ్‌ నటన నన్ను ఆకట్టుకుంది. రాహుల్‌లో ఆ టాలెంట్‌ ఉంది కాబట్టి నేను ఎంకరేజ్‌ చేస్తున్నా. నా లైఫ్‌లోనే కాదు, ఎవరి లైఫ్‌లోనూ సూర్యకాంతం ఉండకూడదు’’ అన్నారు.

హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నాగబాబుగారి కొడుకుగా ఓ సినిమాలో నటించా. అందుకే నిహారికకు అన్నగా ఇక్కడికి వచ్చాను. ‘సూర్యకాంతం’ టీజర్‌ చాలా బావుంది. నా ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాని సృజన్, సందీప్‌ అమెరికాలో విడుదల చేశారు. వాళ్లకు ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి’’ అన్నారు. ‘‘సూర్యకాంతం’ సినిమా ఈ రోజు ఇక్కడి వరకు వచ్చిందంటే కారణం మా అన్న వరుణ్‌తేజ్‌. టీమ్‌ అంతా ఓ ఫ్యామిలీలా కష్టపడి ఈ సినిమా చేశాం.

నా పాత్రకు 100 శాతం న్యాయం చేశానని అనుకుంటున్నా’’ అన్నారు నిహారిక కొణిదెల. ‘‘ప్రణీత్‌ను పిలిపించి అభి క్యారెక్టర్‌కి నేను సూట్‌ అవుతానని వరుణ్‌ తేజ్‌ అన్న సూచించారు. నిహారికగారు సూర్యకాంతం టైటిల్‌కి కరెక్టుగా సరిపోయారు’’ అని రాహుల్‌ విజయ్‌ అన్నారు. ‘‘దిల్‌’ రాజుగారు మా సినిమా చూసి, రిలీజ్‌ చేస్తుండటం మాకు చాలా ఆనందంగా అనిపించింది. నా జీవితంలో ఈ సినిమా చాలా స్పెషల్‌ సినిమా’’ అన్నారు ప్రవీణ్‌. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అని నిర్మాతల్లో ఒక్కరైన సందీప్‌ ఎర్రంరెడ్డి’’ అన్నారు. కృష్ణకాంత్, విజయ్‌ మాస్టర్, దివ్య, కాలభైరవ, పెర్లిన్, మార్క్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)