amp pages | Sakshi

వినాయ‌క్ చేతుల మీదుగా ‘ఎందుకో ఏమో’ టీజ‌ర్ లాంచ్‌

Published on Sun, 01/28/2018 - 15:56

మ‌హేశ్వర క్రియేష‌న్స్ ప‌తాకంపై నందు,నోయ‌ల్, పున‌ర్నవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ఎందుకో ఏమో. కోటి వ‌ద్దినేని ద‌ర్శకత్వంలో మాల‌తి వ‌ద్దినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ రోజు  స్టార్ డైర‌క్టర్ వి.వి.వినాయ‌క్ చేతుల మీదుగా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ...‘‘ ఎందుకో ఎమో’ టైటిల్ లాగే టీజ‌ర్ కూడా చాలా ట్రెండీగా, ఇంట్రస్టింగ్ గా ఉంది. ఈ సినిమా ద్వారా ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న కోటికి మంచి పేరు,  నిర్మాత‌కు లాభాలు రావాల‌నీ మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో న‌టించిన న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు నా శుభాకాంక్షలు’’ అన్నారు.

ద‌ర్శకుడు కోటి వ‌ద్దినేని మాట్లాడుతూ...‘‘ ఎందుకో ఎమో’ సినిమా ద్వారా ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నా. ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా మా చిత్రం టీజ‌ర్ ఆవిష్కరించిన వి.వి.వినాయ‌క్ గారికి కృత‌జ్ఞత‌లు తెలుపుకుంటున్నా. నందు, నోయ‌ల్, పున‌ర్నవి హీరో హీరోయిన్లుగా న‌టించారు. ఇదొక ట్రయాంగిల్ ల‌వ్ స్టోరి. మా నిర్మాత ఎక్కడా రాజీ ప‌డ‌కుండా, పూర్తి స్వేచ్ఛ నివ్వడంతో అనుకున్నట్టుగా సినిమా తీయ‌గ‌లిగాం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సెన్సార్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఫిబ్రవ‌రి మొద‌టి వారంలో ఆడియో విడుద‌ల చేసి, అదే నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

నిర్మాత మాల‌తి వ‌ద్దినేని మాట్లాడుతూ...‘‘ మ‌హేశ్వర క్ర్రియేష‌న్స్ ప‌తాకంపై ఇది మా తొలి సినిమా. వినాయ‌క్ గారి చేతుల మీదుగా మా చిత్రం టీజ‌ర్ విడుద‌ల కావ‌డం శుభ‌సూచ‌కంగా భావిస్తున్నాం. ద‌ర్శకుడు చెప్పిన క‌థ న‌చ్చడంతో సినిమాను ఏ విష‌యంలో రాజీ ప‌డ‌కుండా నిర్మించాం.  మంచి ల‌వ్ స్టోరీ తో పాటు క‌మ‌ర్షియ‌ల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌కు న‌చ్చే సినిమా అవుతుంది. మా యూనిట్ అంతా పూర్తి సహాయ స‌హ‌కారాలు అందించ‌డంతో సినిమాను అనుకున్నవిధంగా పూర్తి చేయ‌గ‌లిగాం. ఫిబ్రవ‌రి మొద‌టి వారంలో ఆడియో విడుద‌ల చేసి  సినిమాను కూడా అదే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)