amp pages | Sakshi

ఈ మాయ పేరేమిటో

Published on Wed, 04/25/2018 - 01:10

సీనియర్‌ ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ తనయుడు రాహుల్‌ విజయ్‌ హీరోగా పరిచయమవుతోన్న విషయం తెలిసిందే. రాము కొప్పుల దర్శకత్వంలో దివ్య విజయ్‌ నిర్మించిన ఈ చిత్రానికి ‘ఈ మాయ పేరేమిటో’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. కావ్యా థాపర్‌ కథానాయిక.  సినిమాలోని కొన్ని సన్నివేశాలను, ఓ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ మాట్లాడుతూ– ‘‘నన్ను ఎంతో ఆదరించిన ఇండస్ట్రీకి మా అబ్బాయి రాహుల్‌ని హీరోగా, అమ్మాయి దివ్యని నిర్మాతగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది.

రాము కొప్పులగారు మంచి కథను అద్భుతంగా తెరకెక్కించారు. నన్ను ఆదరించిన తరహాలోనే మా అబ్బాయి, అమ్మాయిని ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది’’ అన్నారు రాము కొప్పుల. ‘‘రాముగారు సినిమాను అందంగా తీశారు. ఈ చిత్రం అందరూ ఎంజాయ్‌ చేసేలా ఎంటర్‌టైనింగ్‌గా, కూల్‌గా ఉంటుంది’’ అన్నారు రాహుల్‌ విజయ్‌. ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా సినిమా రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు దివ్యా విజయ్‌. ఈ చిత్రానికి ఫైట్స్‌: విజయ్, ఎడిటర్‌: నవీన్‌ నూలి, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు.  

#

Tags

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)