amp pages | Sakshi

దీపకు ఆ హక్కు లేదు: గౌతమ్‌ మీనన్‌ 

Published on Sat, 02/29/2020 - 09:36

పెరంబూరు: దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను నిషేధించాలని కోరే హక్కు ఆమె సోదరుడి కూతురు దీపకు లేదని దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ పేర్కొన్నారు. ‘క్వీన్‌’ పేరుతో గౌతమ్‌ మీనన్‌ జయలలిత బయోపిక్‌ను వెబ్‌ సిరీస్‌గా రూపొందించిన సంగతి తెలిసిందే. అదే విధంగా దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ ‘తలైవి’ పేరుతో జయలలిత బయోపిక్‌ను ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. నటి కంగనారనౌత్‌ జయలలితగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. కాగా జయలలిత బయోపిక్‌ను తన అనుమతి లేకుండా నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ జయలలిత సోదరుడి కూతురు జే.దీప మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జయలలిత బయోపిక్‌లపై నిషేధం విధించలేమని పేర్కొంటూ దీప పిటిషన్‌ను కొట్టి వేశారు.(క్వీన్‌ రివ్యూ: ‘అమ్మ’గా అదరగొట్టిన రమ్యకృష్ణ)

ఈ క్రమంలో ఆమె మరో రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి దర్శకుడు గౌతమ్‌మీనన్, దర్శకుడు విజయ్‌లకు బదులివ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కాగా జయలలిత బయోపిక్‌ కేసు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. దీంతో దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ తరఫు న్యాయవాది కౌంటర్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. అందులో దీపకు జయలలిత బయోపిక్‌ చిత్రాలను నిషేధించాలనే అర్హతగానీ, హక్కుగానీ లేవన్నారు. జయలలిత సొంత బంధువునని చెప్పుకొనే దీప పలుమార్లు తాను జయలలితను కలుసుకునే ప్రయత్నం చేసి విఫలం అయ్యానని చెప్పారన్నారు. అయినా తాను రూపొందించిన ‘క్వీన్‌’ సిరిస్‌ యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినదని, అనితా శివకుమార్‌ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించిన సిరీస్‌ అని చెప్పారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను మార్చి 8వ తేదీకి వాయిదా వేశారు.  

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)