amp pages | Sakshi

జార్జిరెడ్డి జీవితం యువతకు స్ఫూర్తి

Published on Fri, 11/22/2019 - 09:51

సాక్షి, కాచిగూడ: చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న జార్జిరెడ్డి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ‘జార్జిరెడ్డి’ చిత్ర దర్శకుడు జీవన్‌రెడ్డి అన్నారు. సినిమా విడుదల సందర్భంగా గురువారం నారాయణగూడలోని క్రైస్తవ స్మశానవాటికలో జార్జిరెడ్డి సమాధి వద్ద చిత్ర యూనిట్‌ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దర్శకుడు జీవన్‌రెడ్డి, నిర్మాతలు దామోదర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, హీరో సందీప్‌ మాధవ్‌ మాట్లాడుతూ నీతి, నిజాయితీ గల జార్జిరెడ్డి రేపు మళ్లీ పుట్టబోతున్నాడని, ఆయన జీవితం అందరికి ఆదర్శప్రాయంగా ఉంటుందన్నారు.

జార్జిరెడ్డి చిత్రం విడుదల తర్వాతే ఎవరికైనా తాను సమాధానం చెబుతానని దర్శకుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించలేదని, ఆయన నీతి, నిజాయితీ, నాయకత్వ లక్షణాలు తను ఎంతో ఆకట్టుకున్నాయని, రెండేళ్ల పాటు జార్జిరెడ్డి జీవితాన్ని అధ్యయనం చేశాక సినిమాగా రూపొందించామన్నారు. 25 ఏళ్లకే ఓ విద్యార్థి నాయకుడిగా ఎదిగి నాటికి, నేటికి యువతకు స్ఫూర్తిగా నిలిచాడని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సినిమాపై ఎలాంటి ఆపోహలు వద్దని, ఎవరికైనా అభ్యంతరముంటే వారితో కలిసి తాము సినిమాను చూస్తామని, వారికి సమాధానం చెబుతామని జీవన్‌రెడ్డి అన్నారు.  జార్జిరెడ్డి జీవితకథ మాత్రమే చిత్రంలో చూపిస్తున్నామన్నారు. సమాజం జార్జిరెడ్డి లాంటి వాళ్లను చాలామందిని కోల్పోయిందని, ఎలా కోల్పోయామో తెలిపేందుకు సినిమా తీశామన్నారు. 

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?