amp pages | Sakshi

'గురు' మూవీ రివ్యూ

Published on Fri, 03/31/2017 - 07:58



టైటిల్ :
గురు
జానర్ : ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా
తారాగణం : వెంకటేష్, రితికా సింగ్, నాజర్, జకీర్ హుస్సేన్
సంగీతం : సంతోష్ నారాయణ
దర్శకత్వం : సుధ కొంగర
నిర్మాత : వై నాట్ స్టూడియోస్

తమిళ, హిందీ  భాషల్లో ఘన విజయం సాధించిన ఇరుద్ది సుత్రు, సాలాఖద్దూస్ సినిమాలకు రీమేక్గా తెలుగులో తెరకెక్కిన సినిమా గురు. ఒరిజినల్ వర్షన్ను తెరకెక్కించిన సుధ కొంగర దర్శకత్వంలోనే తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కించారు. తమిళ, హిందీ భాషల్లో నటించిన చాలా మంది నటులు తెలుగులోనూ అదే పాత్రల్లో కనిపించారు. చాలా రోజుల తరువాత వెంకటేష్ చేసిన ఈ సీరియస్ రోల్ అభిమానులను ఎంత వరకు ఆకట్టుకుంది..?



కథ :
ఆదిత్య రావు ( వెంకటేష్) దేశం కోసం మెడల్ సాధించాలన్న కసి ఉన్న బాక్సర్. 1996లో వరల్డ్ చాంపియన్ షిప్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్న ఆది, సెలక్షన్ కమిటీ రాజకీయాల మూలంగా ఆ అవకాశం కోల్పోతాడు. చీఫ్ సెలెక్టర్ దేవ్ ఖత్రీ (జకీర్ హుస్సేన్) కావాలనే ఆదిని గేమ్కు దూరం చేస్తాడు. దీంతో చాలా కాలం పాటు బాక్సింగ్ రింగ్కు దూరంగా ఉండిపోయిన ఆదిని కొంత కాలం తరువాత ఉమెన్స్ బాక్సింగ్ కోచ్గా నియమిస్తారు. అయితే అక్కడ కూడా స్టూడెంట్స్తో కఠినంగా వ్యవహరిస్తున్నాడన్న సాకుతో ఢిల్లీ నుంచి వైజాగ్కు ట్రాన్స్ఫర్ చేస్తారు.

వైజాగ్ చేరుకున్న ఆది, మార్కెట్లో కూరగాయలు అమ్మే రామేశ్వరి అలియాస్ రాముడు (రితికా సింగ్) గొడవ పడటం చూసి ఆమెను బాక్సర్గా తయారు చేయాలనుకుంటాడు. ఆమె అక్క లక్స్ అలియాస్ లక్ష్మీ (ముంతాజ్ సర్కార్) అప్పటికే స్పోర్ట్స్ కోటాలో పోలీస్ ఉద్యోగం సాధించాలన్న ఆశతో బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ఈ ఇద్దరినీ తనతో పాటు తీసుకెళ్లిన ఆది, రాముడిపై స్పెషల్ ఇంట్రస్ట్ చూపించటం లక్స్కి నచ్చదు. ఎలాగైన రాముడ్ని తిప్పి పంపేయాలన్న ఆలోచనతో కీలక మ్యాచ్కు ముందు రాముడి చేతికి దెబ్బ తగిలేలా చేస్తుంది. రాముడు కావాలనే ఇలా  చేసిందన్న కోపంతో ఆది ఆమెను పంపేస్తాడు.

తిరిగి ఇంటికి వచ్చిన రాముడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది. బాక్సింగ్ ట్రైనింగ్ ఎలా కొనసాగించింది. ఆది అనుకున్నట్టుగా రాముడు ఉమెన్స్ వరల్డ్ చాంపియన్ షిప్ సాధించిందా..? లేదా..? అన్నదే మిగతా కథ.


నటీనటులు :
ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలు మాత్రమే చేసే విక్టరీ వెంకటేష్, తొలిసారిగా ఓ కొత్త మేకవర్, కొత్త బాడీలాంగ్వేజ్తో ఆడియన్స్  ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఎన్నో అవార్డులు సాధించిన వెంకీ, బాక్సింగ్ కోచ్గా మరోసారి అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్తో అలరించాడు. సినిమా అంతా సీరియస్ లుక్లో కనిపిస్తూనే అద్భుతమైన ఎమోషన్స్ను పండించాడు. ఒరిజినల్ వర్షన్లో తనదైన నటనతో విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న రితికా సింగ్ తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకునే నటన కనబరిచింది. బాధ్యత లేని అల్లరి అమ్మాయిగా, మెడల్ సాధించడానికి ఎంత కష్టాన్నైనా బరించే సీన్సియర్ ప్లేయర్గా మంచి వేరియేషన్స్ చూపించింది. విలన్ పాత్రలో జకీర్ హుస్సెన్ ఆకట్టుకోగా, నాజర్ కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. రఘుబాబు, అనితాచౌదరి, ముంతాజ్ సర్కార్లు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :
సౌత్ ఇండస్ట్రీలో స్పోర్ట్స్ డ్రామాల వచ్చిన దాఖలాలు చాలా తక్కువ. గతంలో ఒకటి రెండు సినిమాలు వచ్చిన ఓ స్టార్ హీరో ఈ తరహా సినిమా చేయటం మాత్రం ఇదే తొలిసారి. ఇలాంటి ఓ సీరియస్ స్పోర్ట్స్ సినిమాకు వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరోను ఎంచుకున్న దర్శకురాలు సుధ కొంగర మంచి విజయం సాధించింది. వెంకీ పర్ఫామెన్స్తో పాటు ఎక్కడా అనుకున్న లైన్ నుంచి డీవియేట్ కాకుండా ఒకే ఎమోషన్ను క్యారీ చేస్తూ కథ నడిపించారు. సంతోష్ నారాయణ అందించిన నేపథ్యం సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ సినిమా స్థాయిని పెంచాయి. హర్షవర్థన్ అందించిన మాటలు, కె ఎ శక్తివేల్ సినిమాటోగ్రఫి, సతీస్ సూర్య ఎడిటింగ్, వై నాట్ స్టూడియోస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.



ప్లస్ పాయింట్స్ :
వెంకటేష్, రితికా సింగ్ నటన
సంగీతం
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :
సెకండ హాఫ్ లో కొన్ని సీన్స్

గురు.. ఆలోచింప చేసే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా

- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)